Viral Video: ఒడిశాలో బైక్‌పై రొమాన్స్, ప్రమాదకర స్టంట్ – సోషల్ మీడియాలో హల్‌చల్
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఒక సంచలన సంఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఓ ప్రేమజంట బైక్‌పై ప్రయాణిస్తూ రొమాన్స్‌తో పాటు ప్రమాదకర స్టంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Viral Video: ఒడిశాలో బైక్‌పై రొమాన్స్, ప్రమాదకర స్టంట్ – సోషల్ మీడియాలో హల్‌చల్
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఒక సంచలన సంఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఓ ప్రేమజంట బైక్‌పై ప్రయాణిస్తూ రొమాన్స్‌తో పాటు ప్రమాదకర స్టంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన హై–ప్రొఫైల్ ఇన్ఫోసిటీ ప్రాంతంలో చోటుచేసుకోగా, ఆ దృశ్యాలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫోటోల ప్రకారం — అబ్బాయి బైక్ నడుపుతుండగా, అమ్మాయి బైక్ ట్యాంక్‌పై చాలా రిస్క్‌గా కూర్చుని రొమాన్స్ చేస్తున్నారు. వీరిద్దరూ హెల్మెట్ ధరించకపోవడమే కాకుండా ఎలాంటి ట్రాఫిక్ నియమాలు పాటించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జంట పోలీస్ స్టేషన్ ముందు నుంచే వెళ్లింది. అయినప్పటికీ వారిని ఎవరూ ఆపలేదు. భువనేశ్వర్‌లో వందలాది CCTV కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన ఎవరికి కనబడకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, ఇది కేవలం స్టంట్ మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇలాంటి సంఘటనలకు కఠిన చర్యలు తప్పనిసరి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రహదారిని సురక్షిత ప్రయాణం కోసం ఉపయోగించుకోవాలి కానీ స్టంట్‌ల వేదికగా మార్చకూడదని సోషల్ మీడియా వాసులు హెచ్చరిస్తున్నారు.