Viral Video: ప్రాణాల మీదికి తీసుకొచ్చిన బర్త్‌డే క్యాండిల్.. షాకింగ్ వీడియో..!
Viral Video: పుట్టిన రోజు అంటే ముందుగా గుర్తొచ్చేది కేక్. ఏది ఏమైనా కేక్ కట్ చేయాల్సిందే.
Viral Video: ప్రాణాల మీదికి తీసుకొచ్చిన బర్త్‌డే క్యాండిల్.. షాకింగ్ వీడియో..!
Viral Video: పుట్టిన రోజు అంటే ముందుగా గుర్తొచ్చేది కేక్. ఏది ఏమైనా కేక్ కట్ చేయాల్సిందే. అయితే కేక్ కట్ చేసే సమయంలో రకరకాల క్యాండిల్స్‌ను, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. మార్కెట్లోకి వింతవింత క్యాండిల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ క్యాండిల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ క్యాండిల్స్‌లో నుంచి వచ్చే మంట కారణంగా కంటి చూపు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ యువతి పుట్టిన రోజు వేడుకను కుటంబ సభ్యులు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అంతా చుట్టు చేరి హ్యాపీ బర్త్‌డే అంటూ సరదాగా గడుపుతున్నారు. అయితే అదే సమయంలో కేక్ తామరపువ్వు ఆకారంలో ఉన్న క్యాండిల్ కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ క్యాండిల్‌ను వెలిగించగానే, రెక్కలు విచ్చుకొని ఒక మ్యూజిక్ వస్తుంది. అయితే ఆ వస్తువు తయారీలో సమస్య ఉందో లేదా మరే కారణమో కానీ క్యాండిల్ ఒక్కసారిగా పేలింది.
ఆ పేలుడు దాటికి కేక్ మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో అక్కడనున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదంతా అక్కడే సెల్ ఫోన్‌లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తు ఎవరీకి ఎలాంటి ప్రమాదం జరలేదు కానీ జరిగి ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి పుట్టిన రోజు వేడుకల్లో క్యాండిల్ వెలిగించాలంటేనే భయపడడం ఖాయం. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.