Viral Video: పక్కన అందమైన అమ్మాయి నిలబడతే.. ఈ ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి..!

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. థ్రిల్లింగ్‌గా ఉంటాయి.

Update: 2025-07-14 08:33 GMT

Viral Video: పక్కన అందమైన అమ్మాయి నిలబడతే.. ఈ ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి..!

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని మనల్ని కూడా భావోద్వేగానికి గురిచేస్తాయి. అలాంటి ఒక సంఘటనే థాయిలాండ్‌లోని ఎలిఫెంట్ పార్కులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒక ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక అందమైన అమ్మాయి థాయిలాండ్‌లో ఉన్న ఎలిఫెంట్ పార్కుకి వెళ్లింది. అక్కడ పార్కులో ఉన్న ఒక ఎలిఫెంట్ పిల్ల పక్కన నిలబడి ఫోటో దిగాలనుకుంది. అంతలో ఆ చిన్న ఏనుగు పిల్ల పక్కన అందమైన అమ్మాయి వచ్చేసరికి.. టక్కున బుగ్గపై ముద్దు పెట్టేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వావ్.. ఇది అత్యంత టచింగ్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

బటూల్ అనే మహిళ ఏనుగు పిల్ల పక్కన నిలబడగానే ఆ ఏనుగు పిల్ల టక్కున ఆమె బుగ్గపై ఒక ముద్దు శబ్ధంతో ముద్దు పెట్టింది. ఒకటి ఇలా రెండు సార్లు ఆ ఏనుగు పిల్ల ముద్దు పెట్టడంతో అందరూ భలే ఆనందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇది ఊహించని ముద్దు, నేను హలో చెప్పడానికి వెళితే ముద్ది పెట్టి పంపింది...అనే క్యాప్సన్‌తో తెగ చక్కర్లు కొడుతోంది.

అమేలియా మరియాన్ అని పిలిచే ఈ ఏనుగుపిల్ల ముద్దు చేష్టలు చూసి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. అందుకే నాలుగు మిలియన్లు వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి. ఇలాంటి వీడియోలు మళ్లీ మళ్లీ చూడాలని పిస్తాయి. ఈ వీడియో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో.. అంటూ హార్ట్స్ పెడుతూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.


Tags:    

Similar News