Viral Video: ఈ అమ్మాయి ఏంటండి బాబు.. మరీ ఇలా ఉంది, వైరల్‌ వీడియో

Viral Video: రోడ్డుపై ప్రయాణించే సమయంలో కచ్చితంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతుంటారు.

Update: 2024-12-27 15:20 GMT

Viral Video: ఈ అమ్మాయి ఏంటండి బాబు.. మరీ ఇలా ఉంది, వైరల్‌ వీడియో

Viral Video: రోడ్డుపై ప్రయాణించే సమయంలో కచ్చితంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతుంటారు. ప్రమాదాల బారిన పకుండా ఉండాలన్నా, ఇతరుకుల ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా కచ్చితంగా రోడ్డు భద్రతా నిబంధనలను తప్పక పాటించాలని సూచిస్తుంటారు. అయితే చాలా మంది తెలిసినా ఈ నిబంధనలను బేకాతరు చేస్తుంటారు. ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.

అయితే సహజంగా ఇలా రోడ్డు భద్రతా నిబంధనలు గాలికి వదిలేసి, జులాయిగా గడిపే వారు ఎక్కువగా మగవారు మాత్రమే ఉంటారని చాలా మంది భావిస్తుంటారు. కానీ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం మహిళలు కూడా ఇందులో తక్కువేం కాదని నిరూపించేలా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి బైక్‌పై చేసిన పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో, అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ యువతి బిజీగా రోడ్డుపై స్కూటీపైన రయ్యిమంటూ దూసుకుపోతోంది. ఇదే సమయంలో హ్యాండిల్‌ను పూర్తిగా వదిలేసి నడుము మీద చేతులు పెట్టుకుని సీటుపైకి వంగింది. ఆ తర్వాత మళ్లీ పైకి లేచి బైక్‌ నడిపింది. అచ్చంగా జులాయి కుర్రాళ్లు ఎలా చేస్తారో అలావో ప్రవర్తిస్తూ స్కూటీపై హల్చల్‌ చేసింది. దీనంతటినీ వెనకాల కారులో వస్తున్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను సుమారు 5 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నట్లే ఇందులో కూడా ముందు వరుసలో ఉన్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇలాంటి ఫీట్స్‌ చేయడం అవసరమా అంటూ కామెంట్స్‌ చేశారు. మొత్తంమీద ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.



Tags:    

Similar News