Viral Video: 55 ఏళ్లుగా విడదీయలేని స్నేహబంధం – ఐఎఫ్‌ఎస్ అధికారి సుప్రియా సాహు పోస్ట్ వైరల్
స్నేహం కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు, జంతువుల మధ్య కూడా ఎంతో బలంగా ఉంటుంది అని చెప్పే ఉదాహరణ ఇదే. ఏకంగా ఐదున్నర దశాబ్ధాలుగా భామ, కామాక్షి అనే రెండు ఏనుగులు విడదీయలేని మిత్రులుగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Viral Video: 55 ఏళ్లుగా విడదీయలేని స్నేహబంధం – ఐఎఫ్‌ఎస్ అధికారి సుప్రియా సాహు పోస్ట్ వైరల్
స్నేహం కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు, జంతువుల మధ్య కూడా ఎంతో బలంగా ఉంటుంది అని చెప్పే ఉదాహరణ ఇదే. ఏకంగా ఐదున్నర దశాబ్ధాలుగా భామ, కామాక్షి అనే రెండు ఏనుగులు విడదీయలేని మిత్రులుగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం, చెరకుగడలు తినడం వంటి పనులన్నింటిలోనూ ఇవి కలిసే పాల్గొంటాయి.
ఈ అపూర్వ స్నేహబంధాన్ని గురించి ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తమిళనాడులోని తెప్పకాడు శిబిరంలో నివసిస్తున్న ఈ జంట ఏనుగులు 30 ఏనుగుల బృందంలో ప్రత్యేకంగా గుర్తించబడ్డాయి. ఆమె వివరించిన ఈ స్నేహ గాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భామ వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు కాగా, కామాక్షికి 65 సంవత్సరాలు. సగానికి పైగా జీవిత కాలం పాటు వీరి స్నేహం కొనసాగుతుండటమే ఎంతో అన్యోన్యతను సూచిస్తుంది. ఏనుగులు తమ భావోద్వేగాలను పంచుకునే తీరును ఈ జంట స్పష్టంగా చూపిస్తోంది.
ఒక సందర్భంలో మేత కోసం అడవిలోకి తీసుకెళ్తున్న మావటిపై చిరుతపులి దాడి చేయగా, భామ ధైర్యంగా ఎదురొడ్డి అతడిని రక్షించింది. మరోసారి కామాక్షిపై మగ ఏనుగు దాడి చేయగా, తీవ్రమైన గాయాలైనా సైతం ఆమె ధైర్యాన్ని కోల్పోలేదని సుప్రియా వివరించారు.
క్యాంప్ మీలో టైంలో కూడా ఈ జంట కలిసే భోజనం చేస్తుంది. చెరకు వీరిద్దరికీ ఇష్టమైన ఆహారం కావడంతో ఒక్కదానికే ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయరట. క్యాంప్ అధికారులు వీటి సంరక్షణలో చేస్తున్న సేవను కూడా సుప్రియా ప్రశంసించారు.
ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా, "అంతకాలం ఈ జంతువులు మిత్రులుగా ఉండటం నిజంగా అరుదైన విషయం" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భామ, కామాక్షిల స్నేహబంధం గురించి రెండు వీడియోలను సుప్రియా షేర్ చేయగా, అవి వేలాదిమందిని ఆకట్టుకున్నాయి.