Viral News: రన్నింగ్ కారు డిక్కీ నుంచి వేలాడిన మనిషి చేతి.. అసలు విషయం తెలిస్తే
Viral News: ఎలాగైనా వైరల్ అవ్వాలి, త్వరగా పాపులర్ అవ్వాలి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరి ఆలోచన ఇలాగే ఉంటోంది.
Viral News: రన్నింగ్ కారు డిక్కీ నుంచి వేలాడిన మనిషి చేతి.. అసలు విషయం తెలిస్తే
Viral News
Viral News: ఎలాగైనా వైరల్ అవ్వాలి, త్వరగా పాపులర్ అవ్వాలి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరి ఆలోచన ఇలాగే ఉంటోంది. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా ముంబై నగరంలో జరిగిన ఓ సంఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రాంక్ పేరుతో కొందరు యువకులు చేసిన పనికి నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే… ముంబైలోని వాషీలో సోమవారం సాయంత్రం ఓ కారు డిక్కీ నుంచి మనిషి చేతి లాంటి ఓ చేతి భాగం బయటకి కనిపిస్తూ వెళ్తున్న వీడియో ఒకటిది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యం చూసిన ఓ డ్రైవర్ వీడియో తీసి షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలా మంది నిజంగానే డెడ్ బాడీని కారులో తీసుకెళ్తున్నారని అనుమానించారు.
ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరింది. దీంతో నవి ముంబై పోలీసులు, క్రైం బ్రాంచ్ టీం వెంటనే చర్యలు తీసుకున్నారు. కార్ నంబర్ ఆధారంగా రెండు గంటల్లోనే ఆ కారును గుర్తించి, ఘట్కోపర్ లో ట్రేస్ చేశారు. అయితే అక్కడికి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ముగ్గురు యువకులు ఒక ల్యాప్‌టాప్ షాప్ ప్రచారానికి భాగంగా చేసిన ప్రాంక్ అని తేలింది.
వీరిలో ఒకరు నవి ముంబైకి చెందిన కోపర్కైర్నేలో ల్యాప్‌టాప్ షాప్ నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. తమ వ్యాపార ప్రచారంగా ఓ వీడియోను సృష్టించేందుకు ఇలా ప్రాంక్ ప్లాన్ చేశారట. విచారణలో ఈ నలుగురు కూడా అంగీకరించారు. అయితే ఈ వీడియో ల్యాప్‌టాప్ అమ్మకాలకు ఎలా సంబంధం ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు. పోలీసులు వీరిపై మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 కింద కేసు నమోదు చేశారు. ఇది ప్రమాదకరమైన, అశ్రద్ధగా వాహనం నడిపినదానికి సంబంధించింది.