Viral Video: లైవ్‌లో పిడుగు పడడాన్ని ఎప్పుడైనా చూశారా.. విమానంపై..

Viral Video: పిడుగులు పడడం సర్వసాధారణమైన విషయం. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులు వస్తుంటాయి.

Update: 2025-01-28 08:00 GMT

Viral Video: లైవ్‌లో పిడుగు పడడాన్ని ఎప్పుడైనా చూశారా.. విమానంపై..

Viral Video: పిడుగులు పడడం సర్వసాధారణమైన విషయం. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిడుగులు పడే అవకాశం ఉంటే ప్రభుత్వాలు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తాయి. వీలైనంత వరకు చెట్లు, టవర్స్‌ దగ్గర ఉండకూడదని హెచ్చరిస్తుంటారు. దీనికి కారణం ఇలాంటి ప్రదేశాల్లోనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి.

అయితే లైవ్‌లో పిడుగు పడడాన్ని చాలా అరుదుగా చూసి ఉంటాం. సీసీకెమెరాలు, సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చినందున ఇలాంటి వాటికి సంబంధించిన సంఘటనలు ఎక్కడ జరిగినా ప్రపంచంలో క్షణాల్లో తెలుస్తోంది.

లైవ్‌లో పిడుగు పడితే ఇంత డేంజర్‌గా ఉంటుందా అనడానికి ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

భారీగా వర్షం కురుస్తున్న సమయంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం రన్‌వేపై నిలిచింది. అదే సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఓ మెరుపు విమాన్ని తాకింది. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఓ సీసీటీవీలో ఈ దృశ్యం రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే విమానాన్ని పూర్తిగా పరిశీలించి, అవసరమైన భద్రతా చర్యలను చేపట్టారు. ఈ కారణంగా విమానం సుమారు 6 గంటల ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. కాగా విమానాలను పిడుగుపాటును సైతం తట్టుకునే వీలుగా పటిష్టమైన లోహంతో తయారు చేస్తారు. ఈ కారణంగా విమానాలపై పిడుగు పడ్డా ఎలాంటి ప్రమాదం జరగదని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News