Viral Video: కుంభమేళలో అద్భుతం.. మహిళ పుణ్యస్నానం చేసిన వెంటనే
Viral Video: ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చిన విషయం తెలిసిందే.
Viral Video: ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గకుండా, దాదాపు 70 కోట్ల మంది ఈ పవిత్ర స్నాన మహోత్సవంలో పాల్గొన్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రతి రోజూ కోట్లాది మంది భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తుల్లో విశేషమైన ఆసక్తి నెలకొంది. రైళ్లు, విమానాలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో భక్తులు భారీగా తరలి రావడంతో కుంభమేళ ప్రాంగణం జనసంద్రంగా మారింది. భక్తుల సౌకర్యం కోసం యోగి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
కుంభమేళలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ గంగానదిలో పవిత్ర స్నానం చేస్తుండగా, ఓ భారీ సర్పం ఆమె దగ్గరకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళ భయపడకుండా, ఆ సర్పాన్ని ఎంచక్కా చేతిలోకి తీసుకుఇ మెడలో వేసుకుంది.
దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పడీ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతుంటే మరికొందరు మాత్రం ఆ పాము ఆమెకు అలవాటు ఉండే ఉంటుందని. పామును పెంచుకొని ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.