Single Women Booking Cars: కార్లు ఉన్న అబ్బాయిలను బుకింగ్ చేసుకుంటున్న ఒంటరి మహిళలు.. కానీ దాని కోసం కాదు

Single Women Booking Cars: ఒంటరితనం అనేది ఒక మానసిక సమస్యగా మారిపోయింది. మంచి చెడు మాట్లాడుకోడానకి, కష్టసుఖాలు పంచుకోడానికి ఒక తోడు అవసరం. కానీ ఒంటరితనం వల్ల సరైన భాగస్వామి పక్కన లేకపోవడం, ఉన్నా అతను సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆడవాళ్లు చాలామంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు.

Update: 2025-06-18 02:30 GMT

Single Women Booking Cars: కార్లు ఉన్న అబ్బాయిలను బుకింగ్ చేసుకుంటున్న ఒంటరి మహిళలు.. కానీ దాని కోసం కాదు

Single Women Booking Cars: ఈ రోజుల్లో ఒంటరితనం కామన్ అయిపోయింది. పెళ్లిళ్లు అయినా, సెపరేట్‌గా ఉన్నా.. ఎవరైనా ఒంటరితనాన్ని బాగా ఫీల్ అవుతున్నారట. అయితే ఈ ఒంటరితనం పోగొట్టుకోడానికి అమ్మాయిలు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. లగ్జరీ కార్లు ఉన్న అబ్బాయిలను బుక్ చేసుకుని లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తున్నారు.

ఒంటరితనం అనేది ఒక మానసిక సమస్యగా మారిపోయింది. మంచి చెడు మాట్లాడుకోడానకి, కష్టసుఖాలు పంచుకోడానికి ఒక తోడు అవసరం. కానీ ఒంటరితనం వల్ల సరైన భాగస్వామి పక్కన లేకపోవడం, ఉన్నా అతను సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆడవాళ్లు చాలామంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. రిపోర్టుల ప్రకారం చూస్తే ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఇలాంటి ఫీలింగ్‌తో ఇబ్బంది పడే వారు ఒంటరితనాన్ని దూరం చేసుకోడానికి ఇప్పుడు ఈ లాంగ్ డ్రైవ్ కాన్సెప్ట్‌ని ఫాలో అవుతున్నారు.

ఏ కార్లు వస్తాయి?

లగ్జరీకార్లు ఉన్న అబ్బాయిలకు డబ్బులు ఇచ్చి మరీ లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో కాస్తంత టైం తమకోసం కేటాయించుకుని మరీ లాండ్ డ్రైవ్ లకు వెళ్తున్నారు. కాస్త ప్రశాంతతను ఎదుర్కుంటున్నారు. ఇంతకీ ఆ లగ్జరీ కారులో ఏం జరుగుతుంది? అంటే టాక్ థెరపీ ఆన్ వీల్స్. అంటే శారీరక సంబంధం లేకుండా మంచి చెడు మాట్లాడుకోవడం. అహ్లాదకరమైన వాతావరణం, కారు డ్రైవింగ్, మంచి మాటలు ఈ మూడింటిని కోరుకుంటూ ఇప్పుడు అమ్మాయిలు ఈ లాండ్ డ్రైవ్‌ల కోసం అబ్బాయిలను బుక్ చేసుకుంటున్నారు.

ఎలా బుక్ చేసుకుంటారు?

రైడింగ్‌ కోసం ప్రత్యేకమైన యాప్‌లున్నాయి. అలాగే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉంది. ఇందులో బుక్ చేసుకుంటే ఫెరారీ లేదా రోల్స్ రాయిస్ లాంటి స్టైలిస్ కార్లలో అబ్బాయిలు డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. పిక్ చేసుకుని వారికి ఇష్టమైన ప్రాంతానికి లేదా కస్టమర్ ఇష్టమైన ప్రాంతానికి తీసుకెళతారు. ఆ తర్వాత మళ్లీ డ్రాపింగ్ పాయింట్ దగ్గర వదిలేసి వెళ్లిపోతారు. మళ్లీ వీళ్లతో ఎటువంటి సంబంధం ఉండదు.

చైనాలో ఎక్కువ

చైనాలో ఎక్కువగా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. హాంగ్ జౌ, షాంఘై, షెన్ యాంగ్ వంటి మెట్రో నగరాల్లోని అమ్మాయిలు ఎక్కువగా ఈ రైడింగ్‌ను బుక్ చేసుకుంటున్నారు. రైడింగ్ జర్నీ అరగంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. ఒక అరగంట బుక్ చేసుకుంటే మన కరెన్సీలో రు. 1100 నుంచి 1200 వరకు ఖర్చవుతుంది. పగలు మాత్రమే ఈ రైడింగ్‌లు ఉంటున్నాయి.

ఏం మాటలు ఉంటాయి?

పక్కవారితో జరిగిన గొడవలు, భార్యభర్తల మధ్య జరిగిన గొడవలు, స్నేహితుల వల్ల కలిగిన సమస్యలు.. పిల్లలతో వచ్చే టెన్షన్స్.. ఇలా అన్నింటినీ సరదాగా ఒక కొత్త ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటున్నట్టు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మైండ్ రిలాక్స్ అవుతుందని, అతనెవరో కొత్తవాళ్లు కాబట్టి.. వారితో ఎటువంటి గొడవ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతున్నామని కొందరు మహిళలు చెబుతున్నారు. 

Tags:    

Similar News