Dussehra: దసరా రోజు చూద్దామంటే పాలపిట్ట కనిపించదు.. కారణం ఏంటో తెలుసా..?

Dussehra 2023: తెలంగాణలో కెల్లా అతిపెద్ద పండుగ దసరానే. ఏడాదికి ఒకసారి వచ్చేఈ పండుగ కోసం అందురు ఆత్రుతగా ఎదురుచూస్తారు.

Update: 2023-10-23 05:15 GMT

Dussehra: దసరా రోజు చూద్దామంటే పాలపిట్ట కనిపించదు.. కారణం ఏంటో తెలుసా..?

Dussehra 2023: తెలంగాణలో కెల్లా అతిపెద్ద పండుగ దసరానే. ఏడాదికి ఒకసారి వచ్చేఈ పండుగ కోసం అందురు ఆత్రుతగా ఎదురుచూస్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ రోజుకి చాలా ప్రాధాన్యం ఉంది. నవరాత్రులు ముగిసిన తర్వాత పదో రోజును విజయదశమిగా జరుపుకుంటారు. ఈ రోజున ఆయుధ పూజ చేసిన తర్వాత పాలపిట్లను చూస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. అసలు దసరా పండుగకు పాలపిట్టకు మధ్య ఉన్న సంబంధం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పూర్వం పాండవులు అరణ్య వాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందట. అది విజయదశమి కావడం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్నీ విజయాలే సిద్ధించాయని చెబుతారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోందని పెద్దలు చెబుతున్నారు. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి దసరా రోజు మాత్రం కచ్చితంగా దర్శనమిస్తుంది. ఇది అందరికీ కాదు కొంతమందికే. దానిని చూడాలంటే అదృష్టం ఉండాలి మరీ.

పాలపిట్ల తెలంగాణ రాష్ట్ర పక్షి . కానీ కొన్ని రోజులుగా దీని సంతతి అంతరించిపోతుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఊర్లలో అక్కడక్కడా కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూయించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

వాస్తవానికి అది ఫ్రీగా ఎగురుతున్నప్పడు దానిని చూడాలి. కానీ బంధించిన దానిని చూడటం అనేది మంచి పద్దతి కాదు. పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. పొలాల్లో పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల టికి ఆహారం దొరకడం లేదు. అందుకే అవి పంట పొలాల్లో అవి కనిపించడం లేదు. మామూలుగా పాలపిట్టలు చెట్టు తొర్రల్లో గూడు కట్టుకుని అందులో గుడ్లు పెడతాయి. అయితే రకరకాల అవసరాల కోసం ఎండిపోయిన చెట్లను నరికేస్తున్నారు. దీంతో అవి నివాసాలు కోల్పోతున్నాయి. 

Tags:    

Similar News