నేడు వైసీపీలోకి టీడీపీ కీలకనేత!

Update: 2019-12-07 02:16 GMT

నెల్లూరు జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు(శనివారం)సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకొని ఆ పార్టీ తీర్ధం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయనతోపాటు కొందరు తృతీయశ్రేణి నాయకులు కూడా వైసీపీలో చేరనున్నారు. 2009 లో కావాలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన మస్తాన్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2014 లో ఓటమి చెందారు. ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సీఎం జగన్ ఆహ్వానం మేరకు మత్సకార సమావేశంలో పాల్గొన్నారు. స్వతహాగా చేపల ఎక్స్పోర్ట్ వ్యాపారంలో ఉన్న మస్తాన్ రావును మత్సకార కమిటీలో సభ్యుడిగా నియమించారు సీఎం జగన్. దాంతో అప్పుడే ఆయన పార్టీ మారతరాని ఊహాగానాలు వచ్చాయి. తాజాగా శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీలో కీలకనేత అది కూడా బీసీ సామాజికవర్గంలో బలమైన నేతగా ఆయన గుర్తింపుపొందారు. ఒకానొక దశలో టీడీపీ నుంచి మస్తాన్ రావును రాజ్యసభకు పంపుతారని వచ్చాయి. వైసీపీలో ఆయన ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో స్థానిక సంస్థలకు గాను ఒక ఎమ్మెల్సీ వస్తుంది. ఆ స్థానాన్ని బీద మస్తాన్ రావు కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News