Navratri 2022: నవరాత్రులలో ఈ ప్రదేశాలు అద్భుతం.. ఒక్కసారైనా చూడాల్సిందే..!

Navratri 2022: నవరాత్రులలో ఈ ప్రదేశాలు అద్భుతం.. ఒక్కసారైనా చూడాల్సిందే..!

Update: 2022-09-28 14:30 GMT

Navratri 2022: నవరాత్రులలో ఈ ప్రదేశాలు అద్భుతం.. ఒక్కసారైనా చూడాల్సిందే..!

Navratri 2022: సెప్టెంబర్ 26 నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలని అద్భుతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన ప్రదేశాల వద్ద పెద్ద పెద్ద మండపాలని ఏర్పాటుచేస్తారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. నవరాత్రి సమయంలో కొన్ని ప్రదేశాలని సందర్శించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. కోల్‌కతా

నవరాత్రి సమయంలో కోల్‌కతా వెళ్ళవచ్చు. ఇక్కడ సప్తమి, అష్టమి, నవమి, దశమి రాత్రులని చాలా విశిష్టంగా జరుపుకుంటారు. బాగ్‌బజార్ దుర్గా పండల్, శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్, బండుమహల్ క్లబ్ వంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు. విదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తారు.

2. అహ్మదాబాద్

అహ్మదాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో గర్బా నిర్వహిస్తారు. పురుషులు, మహిళలు సంప్రదాయ దుస్తులలో నృత్యం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు మండపాళ్లో నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోని స్ట్రీట్ గర్బా వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

3. ఢిల్లీ

దుర్గా పూజ అందమైన దృశ్యాలను చూడగలిగే అనేక దేవాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ఇక్కడ గర్బా వంటి నృత్య కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. శ్రీ శీత్లా మాతా మందిర్, ఛతర్పూర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.

4. మహారాష్ట్ర

మీరు నవరాత్రులలో మహారాష్ట్రను సందర్శించడానికి వెళ్ళవచ్చు. ఇక్కడ జరిగే దుర్గా పూజలు మీ మనసును ఆకర్షిస్తాయి. ప్రజలు నవరాత్రుల సందర్భంగా కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఒకరి ఇంటికి ఒకరు వస్తారు. కొబ్బరికాయ, తమలపాకులు కానుకగా ఇస్తారు.

Tags:    

Similar News