Monalisa: పూసలు అమ్ముకునే అమ్మాయి ఏకంగా బంగారాన్ని బహుమతిగా ఇచ్చిందిగా..

Monalisa: సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని, ఎలా మార్చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వస్తారు.

Update: 2025-02-21 06:12 GMT

Monalisa: పూసలు అమ్ముకునే అమ్మాయి ఏకంగా బంగారాన్ని బహుమతిగా ఇచ్చిందిగా..

Monalisa: సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని, ఎలా మార్చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వస్తారు. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా ద్వారా జీవితాలు మారిన వారు ఉన్నారు. ఇలాంటి జాబితాలోకే వస్తుంది మోనాలిసా. జాతర్లలో పూసలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి ఒక్క రోజులో నేషనల్ వైడ్‌గా సెలబ్రిటీగా మారింది.

మహాకుంభమేళలో పూసలు అమ్ముకున్న మోనాలిసాను చూసిన కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆమె కళ్లు, అందమైన రూపానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది మోనాలిసా. దీంతో ఈమెకు ఏకంగా సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవ‌డానికి ప్రయాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మహాకుంభమేళాకు వచ్చిన మోనాలిసా.. ఇప్పుడు నేషనల్‌ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది.

మహా కుంభమేళలకు వచ్చిన వారు మోనాలిసాతో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దీంతో ఆమె తన సొంతూరుకు వెళ్లిపోయింది. అయితే అనుకోని అదృష్టంలా ఆమెకు బాలీవుడ్ నుంచి బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. బాలీవుడ్‌ ద‌ర్శకుడు ఆమెకి సినిమా ఛాన్స్ ఇస్తూ సంచలన ప్రకటన చేశాడు. మ‌ణిపూర్ నేప‌థ్యంలో తెర‌కెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. మోనాలిసాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

దీంతో ఆమెకు రెమ్యునరేషన్‌గా రూ. 21 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కొంత అమౌంట్‌ అడ్వాన్స్‌గా కూడా అందించారు. జీవితంలో ఊహించని డబ్బును చూసిన మోనాలిసా తన తొలి పారితోషకంతో అమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టి తన ప్రేమ చాటుకుంది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టా వేదిక‌గా తెలుపుతూ.. చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూసలు అమ్ముకునే యువతి, బంగారం బహుమతిగా ఇచ్చే రేంజ్‌కి ఎదిగింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News