Marriage Muhurat 2026: కొత్త ఏడాదిలో పెళ్లి బాజాలు.. 2026లో శుభ ముహూర్తాల పూర్తి జాబితా ఇదే!

Marriage Muhurat 2026: హిందూ సంప్రదాయం ప్రకారం, శుభ ముహూర్తంలోనే వివాహం జరగడం దాంపత్య జీవితానికి సానుకూల ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది.

Update: 2025-12-25 13:00 GMT

Marriage Muhurat 2026: కొత్త ఏడాదిలో పెళ్లి బాజాలు.. 2026లో శుభ ముహూర్తాల పూర్తి జాబితా ఇదే!

Marriage Muhurat 2026: వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన. రెండు హృదయాలకూ మాత్రమే కాదు, రెండు కుటుంబాలను ఏకం చేసే పవిత్ర బంధం కాబట్టి, పెళ్లి ముహూర్తం శుభకరంగా ఉండడం అత్యవసరం. హిందూ సంప్రదాయం ప్రకారం, శుభ ముహూర్తంలోనే వివాహం జరగడం దాంపత్య జీవితానికి సానుకూల ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది.

ఫిబ్రవరి 17వరకు పెళ్లి ముహూర్తాలు లేకపోవడం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2025 నవంబర్ 26 నుంచి శుక్ర మౌఢ్యమి (శుక్రుడు అస్తమనం) ప్రారంభమై, 2026 ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వివాహం, ఇతర శుభకార్యాలు నిర్వహించడం సంప్రదాయంగా చేయరాదు. దాంతో, 2026 ఫిబ్రవరి 17 వరకు వివాహానికి ముహూర్తాలు లేవు.

2026లో శుభ ముహూర్తాలు (నెల వారీగా)

♦ ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26

♦ మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12

♦ ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29

♦ మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14

♦ జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29

♦ జూలై: 1, 6, 7, 11

♦ ఆగస్టు – అక్టోబర్: చాతుర్మాస్యం కారణంగా శుభ ముహూర్తాలు ఉండవు

♦ నవంబర్: 21, 24, 25, 26

♦ డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12

గమనిక: ఈ ముహూర్తాలు మత, సంప్రదాయం ఆధారంగా సూచించబడ్డాయి. ప్రాంతీయ పంచాంగాల ఆధారంగా తేదీలు మారవచ్చు. వివాహం కోసం తుది నిర్ణయం తీసుకునేముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News