Viral Video: రైలు కిటీకీ వద్ద వేళ్లాడిన యువకుడికి చుక్కలు చూపించిన లోకోపైలట్
Viral Video: రైలు కిటీకీ వద్ద వేళ్లాడి...రైలు వేగం పెరగడంతో... ట్రైన్ స్టంట్ వీడియో వైరల్
Viral video of a man hanging from train window: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక యువకుడు రైలు కిటీకీ వద్ద వేళ్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏదో స్టంట్ చేద్దామని ఆ యువకుడు కిటీకీ వద్ద వేళ్లాడిన సమయంలోనే రైలు వేగం అందుకున్నట్లు తెలుస్తోంది. రైలు వేగం అందుకోవడంతో అక్కడి నుండి బయటపడలేక, అలాగే కిటీకీ వద్ద వేళ్లాడలేక ఆ యువకుడు పడిన తిప్పలు అంతా ఇంతా కాదు. ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
1 నిమిషం 10 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియో చూస్తే... అసలు రైలు ఆగుతుందా లేదా అనే డౌట్ వస్తుంది. ఒకవేళ రైలు ఆగకపోతే ఆ యువకుడి పరిస్థితి ఏంటి? అంతసేపు ఆ యువకుడు అలా వేళ్లాడుతుంటే ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు చైన్ లాగకుండా ఎందుకు ఉన్నారు? ఇలా రకరకాల డౌట్స్ బుర్రని తొలిచేస్తున్నాయి.
ఈ వైరల్ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
వీడియో మొత్తం చూశాకే అసలు విషయం అర్థమైంది.. రైలు కొంతదూరం వెళ్లాకా ఆగిన దృశ్యం చూశాకే హమ్మయ్య ఆ యువకుడు సేఫ్ అనే భావన కలుగుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కస్‌గంజ్ నుండి కాన్పూర్ వెళ్లే రైలులో జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఏడీజీ జోన్ కాన్పూర్ పోలీసులు ఫతేనగర్ పోలీసులకు ట్యాగ్ చేశారు. అలాగే గవర్నమెంట్ రైల్వే పోలీసులను కూడా ట్యాగ్ చేశారు.