Viral Video: కిస్సిక్ పాటకు స్టెప్పులేసిన బామ్మలు.. వైరల్ వీడియో..!
Viral Video: పుష్ప2 మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Viral Video: కిస్సిక్ పాటకు స్టెప్పులేసిన బామ్మలు.. వైరల్ వీడియో..!
Viral Video: పుష్ప2 మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలకు అనుగుణంగానే మంచి వసూళ్లను రాబడుతూ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టింది. ఇక సినిమాలోని పాటలకు సైతం ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి.
ముఖ్యంగా శ్రీలీలా తళుక్కుమన్న కిస్సిక్ సాంగ్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. తొలుత లిరిక్ సాంగ్ విడుదల సమయంలో పెద్దగా బజ్ లేకపోయినప్పటికీ సినిమా విడుదల తర్వాత ఈ పాట నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం కొందరు బామ్మలు. ఓ నలుగురు బామ్మలు కిస్సిక్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక బెల్గం ఊరిలోని శాంతాయ్ వృద్ధాశ్రమానికి చెందిన నలుగురు బామ్మలు కిస్సిక్ పాటకు డ్యాన్స్ చేశారు. 17 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నలుగురు ఒకే రిథమ్‌తో డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందరూ ఒకే కలర్ శారీలో దెబ్బలు దెబ్బలు పడుతాయ్ అంటూ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లను ఫిదా అవుతున్నారు.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటకలోనూ పుష్ప రాజ్ రేంజ్ ఇది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా. దేవీశ్రీ మ్యూజిక్‌కు చిన్నారులతో పాటు బామ్మలు కూడా స్టెప్పులు వేయాల్సిందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మొత్తం మీద పుష్ప2 క్రేజ్ అటు కలెక్షన్లతోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది.