Flying Snake: విశాఖలో ఎగిరే పాము..హడలిపోయి స్థానికులు
Flying Snake: ఎక్కడైనా మనం నడిచే పాముని చూసి ఉంటాం. కానీ ఎగిరే పాముని ఎక్కడా చూసి ఉండం.
Flying Snake: విశాఖలో ఎగిరే పాము..హడలిపోయి స్థానికులు
Flying Snake: ఎక్కడైనా మనం నడిచే పాముని చూసి ఉంటాం. కానీ ఎగిరే పాముని ఎక్కడా చూసి ఉండం. కానీ విశాఖలో ఒక మూడు అంతస్తుల భవనం దగ్గర ఉన్న చెట్టులో ఈ పాము కనిపించింది. ఈ పాము మామూలు పాములకంటే వింతగా ఉంది. దాంతోపాటు ఇది చెట్లపైన ఇటు అటు దూకడం చూసి అక్కడి ప్రజలు హడలిపోయారు. చివరకు పాములు పట్టే వాళ్లకు ఫోన్ చేయడంతో, వారు వచ్చి పామును పట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖపట్నంలో అరుదైన పాము కనిపించింది. ఐదు అంతస్తులు ఉన్న నోస్ నేవల్ క్వార్టర్స్‌లో మూడు అంతస్థులవరకు పాకుతూ వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అయితే దాన్ని చూసిన వెంటనే అది పామా కాదా అన్నది ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే ఆ పాము చాలా చిన్నసైజులో ఉంది. అంతేకాదు, ఆ పాము శరీరంపై నలుపు, ఎరుపు, బంగారం రంగు గీతలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ పాముని చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే పాము పట్టే వ్యక్తి నాగరాజుకి సమాచారాన్ని అందించారు.
వింత ఆకారం, కొత్త రంగులతో పాము కనిపించడంతో చుట్టుపక్కలున్నవారంతా ఆ పాముని చూడడానికి వచ్చారు. సహజంగా పాములు ఒకటి రెండు రంగులు మాత్రమే ఉంటాయి. పైగా పొడవుగా ఉంటాయి. కానీ ఈ పాము వాటికి విరుద్దంగా ఉంది. పైగా మూడు అంతస్తుల వరకు ఎక్కేసింది. దీంతో స్థానికులు భయంతో వణికి పోయారు. అలానే ఏ కిటికీలోంచి ఇంట్లోకి వచ్చేస్తే.. ఏంటి పరిస్థితి అని భయపడ్డారు.
పాములు పట్టే వ్యక్తి నాగరాజు వచ్చి ఆ పామును పట్టుకున్నాడు. ఇది విషపూరితమైందికాదని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే.. ఒక చెట్టుపై నుంచి వేరే చెట్టుపైకి ఎగురుతూ ఉంటాయని చెప్పాడు. వీటికి ఒకే వాతావరణం అలవాటుగా ఉంటుంది. ఆ వాతావరణంలోనే ఇవి పెరుగుతాయి. ఇప్పుడు ఈ పాము అలాంటి వాతావరణంలోనే వదలాలని కూడా అతను చెప్పాడు.
ఇలాంటి పాములు ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి. చాలా తేలికపాటి, తక్కువ సైజులో ఇవి ఉంటాయి. వీటిని బంగారు చెట్టు పాము అని పిలుస్తారు. సాధారణ పాములు నడిచినట్టు ఇది నడవదు. ఎక్కువగా ఎగురుతూ ఉంటుంది. ఇళ్లపైనుంచి అలాగే చెట్లపై నుంచి మరొక చోట ఇవి ఎగురుతుంటాయి. ఈ పాములు దాదాపు 100 మీటర్ల దూరం వరకు దూకగలవు. ఎగిరేముందు గుడ్రంగా చుట్టుకుంటుంది. ఆ తర్వాత ఒక చోట నుండి మరొక చోటకు ఎగురుతుంది.