Snakes: చనిపోయిన పాములు కూడా కాటు వేస్తాయా? శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన ఆశ్చర్యకరమైన నిజం

అస్సాంలోని వైద్యులు, పరిశోధకులు ఒక షాకింగ్‌ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. పాము చనిపోయినా కూడా అది కాటు వేయగలదని శాస్త్రీయంగా నిర్ధారించారు. మొదటిసారిగా ఈ సంఘటనలను అధికారికంగా నమోదు చేశారు.

Update: 2025-09-01 06:56 GMT

Snakes: చనిపోయిన పాములు కూడా కాటు వేస్తాయా? శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన ఆశ్చర్యకరమైన నిజం

అస్సాంలోని వైద్యులు, పరిశోధకులు ఒక షాకింగ్‌ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. పాము చనిపోయినా కూడా అది కాటు వేయగలదని శాస్త్రీయంగా నిర్ధారించారు. మొదటిసారిగా ఈ సంఘటనలను అధికారికంగా నమోదు చేశారు.

ఈ కేసుల్లో ఒకటి మోనోక్లెడ్ కోబ్రా, మరొకటి బ్లాక్ క్రైట్ పాముతో సంబంధమున్నాయి. చనిపోయిన తర్వాత కూడా ఈ పాములు మానవులను కరిచాయి. ఈ రీసెర్చ్ ఫలితాలు ఆగస్టు 19న Frontiers in Tropical Diseases జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.

ఎలా బయటపడ్డాయి ఈ కేసులు?

శివసాగర్ జిల్లాలోని డెమో రూరల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డాక్టర్ సురజిత్ గిరి నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.

ఒక వ్యక్తి పామును పారేస్తుండగా, చనిపోయిన మోనోక్లెడ్ కోబ్రా తల అతన్ని కరిచింది. తీవ్రమైన నొప్పి, వాంతులు రావడంతో అతనికి 20 సీసాల యాంటీవీనమ్ ఇచ్చి చికిత్స అందించారు. గాయం పెద్దగా ఉన్నా చివరికి అతను పూర్తిగా కోలుకున్నాడు.

మరో ఘటనలో, ట్రాక్టర్ కింద నలిగిన నాగుపాము రైతు కాలు మీద కాటు వేసింది. దీనివల్ల తీవ్రమైన గాయాలు వచ్చాయి. చికిత్సలో 20 వైల్స్ యాంటీవీనమ్, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. దాదాపు 25 రోజులకు ఆ రైతు కోలుకున్నాడు.

చనిపోయినా పాము ఎందుకు ప్రమాదకరం?

డాక్టర్ గిరి వివరణ ప్రకారం

చనిపోయినా లేదా తలనరికి వేశినా పాముల కండరాల్లో రిఫ్లెక్స్ మూవ్‌మెంట్స్ కొనసాగుతాయి.

వాటి విషగ్రంథుల్లో నిల్వ ఉన్న విషం బయటకు వచ్చి కాటు ద్వారా శరీరంలోకి చేరుతుంది.

దీని వల్ల పాము చనిపోయినా నిర్లక్ష్యంగా తాకితే ప్రమాదం తప్పదు. ముఖ్యంగా కోబ్రాస్, క్రైట్స్ వంటి ముందుకోరలున్న పాములు చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ సేపు విషం ఇంజెక్ట్ చేయగలవు.

జాగ్రత్తలు

పాము చనిపోయిందని అనుకున్నా దానిని చేతితో పట్టుకోవద్దు.

కర్ర లేదా పరికరంతోనే తరలించాలి.

పిల్లలకు, పెద్దలకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించడం చాలా అవసరం.

ఈ పరిశోధన ఉష్ణమండల ప్రాంతాల్లో పాముకాటు ప్రమాదాలపై కొత్త దృక్పథాన్ని అందించింది. చనిపోయిన పాములనూ నిర్లక్ష్యం చేయకూడదనే విషయం ఇప్పుడు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.

Tags:    

Similar News