మార్కెట్‌లో ఆకట్టుకుంటున్న మట్టిప్రమిదలు

Update: 2019-10-26 15:47 GMT

దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది హోరెత్తించే టపాసులు, వెలుగులు విరజిమ్మే దీపాలు. ఎంతటి పేదవారైనా, ధనవంతులైనా దీపావళి నాడు మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. రెడిమెడ్‌ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తినా మట్టి ప్రమిదలకు క్రేజ్‌ తగ్గడం లేదు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఫ్యాన్సీ టచ్‌ ఇస్టున్నారు. మార్కెట్‌లో కనువిందు చేస్తున్న వెరైటీ ప్రమిదలపై స్పెషల్‌ స్టోరీ..

వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలు, టపాసులే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. గుమ్మం నుంచి ఇంటి ఆవరణ వరకూ దీపాల కాంతులతో ధగధగ మెరిసిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. మట్టిప్రవిదలకు నయా లుక్‌ను జోడించి అందంగా తయారు చేస్తున్నారు కోల్‌కత్తాకు చెందిన కార్మికులు. దేవతామూర్తుల, సంప్రదాయ ప్రమిదలతో పాటు ఆకట్టుకునే డిజైన్లను తయారు చేస్తున్నారు.

బల్బులు, క్యాండిల్స్‌తో దీపావళి వెలుగులు విరజిమ్మాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. దీంతో మార్కెట్‌లో ఎన్నో వెరైటీలు దొరుతున్నా మట్టి ప్రమిదలే ఇష్టమంటున్నారు కస్టమర్లు. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే అంత మంచే జరుగుతుందని... అందుకే వాటిని కొనేందుకు వచ్చామని చెబుతున్నారు. పైగా సరసమైన ధరలకే లభించడంతో వాటి కొనడానికి ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు.అందంగా ఉండడంతో పాటు.. ప్రకృతికి హాని కలగకుండా ఉండటంతో మట్టి ప్రమిదలకే జనం జై కొడుతున్నారు. దీంతో మట్టిప్రమిదలకు డిమాండ్ బాగా పెరిగింది.

Tags:    

Similar News