Pension: కేంద్ర ప్రభుత్వ బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.5,000 పెన్షన్‌ పొందే ఛాన్స్‌..

Atal Pension Scheme: ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బులో కాస్త భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకుంటారు.

Update: 2025-04-18 11:18 GMT

Atal Pension Scheme: ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బులో కాస్త భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకుంటారు. అది వారి వయోభారం సమయంలో ఆసరాగా ఉంటాయని పెట్టుబడులు పెడతారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్‌ పెన్షన్‌ యోజన ద్వారా ప్రతినెల రూ.5000 పొందవచ్చు. మీ ప్రతినెలా పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం రూ.5000 పెన్షన్ అందిస్తుంది. దీనికి మీరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు ప్రతినెలా కేవలం రూ.1000 చెల్లించాల్సిన పని కూడా లేదు. అంతేకంటే తక్కువ జమ చేస్తే సరిపోతుంది.. ఈ పథకం లాభాలు ఇతర వివరాలు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఈ అటల్‌ పెన్షన్‌ యోజనలో చేరారు. ఈ పథకంలో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. ఇక గరిష్టంగా 40 ఏళ్లు కలిగి ఉండాలి. ప్రతినెలా కేవలం రూ.210 చెల్లిస్తే మీరు 60 ఏళ్లు వచ్చాక ప్రతినెలా రూ.5000 పొందుతారు. ఈ పథకంలో చేరాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచీని కాంటాక్ట్‌ అవ్వండి.

అంటే ప్రతినెలా రూ.5000 అంటే ఏడాదికి రూ.60,000 పెన్షన్‌ రూపంలో పొందుతారు. అటల్‌ పెన్షన్‌ యోజనకు దరఖాస్తు చేసుకునే విధానం..

మీ దగ్గరలోని ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ బ్రాంచీకి వెళ్లి అటల్‌ పెన్షన్‌ యోజన పథకానికి సంబంధించిన ఫారమ్‌ నింపాలి. అక్కడ దరఖాస్తు చేయమని బ్యాంకు అధికారులను అడగండి. ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్‌ చేయాలి. ఆ తర్వాత ప్రక్రియ మొదలవుతుంది. మీకు ప్రతినెలా రూ.1000 నుంచి రూ.5000 ప్లాన్‌ ఏది కావాలంటే అది ఎంపిక చేసుకోవచ్చు. మీ బ్యాంకుకు లింక్‌ చేస్తే ఆటోమెటిక్‌గా డబ్బులు డెబిట్‌ అయిపోతాయి. ఇలా సులభంగా అటల్‌ పెన్షన్‌ యోజనకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News