ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? రాజ కుటుంబానికి చెందిన హీరోయిన్
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత హీరోయిన్లు, అభిమానులతో ఇంట్రాక్షన్ పెరుగుతోంది.
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? రాజ కుటుంబానికి చెందిన హీరోయిన్
Actress: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత హీరోయిన్లు, అభిమానులతో ఇంట్రాక్షన్ పెరుగుతోంది. తమ అభిరుచులను, ఇష్టాలను ఎప్పటికప్పుడు అభిమాలనుతో షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ తన చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోనే ఇక్కడ మనం చూస్తున్న ఫోటో. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ఈ బ్యూటీ ఓ స్టార్ హీరోయిన్. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.
ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదండోయ్ ఈ హీరోయిన్ రాజ కుటుంబానికి చెందింది. ఇటీవలే ఓ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార. అదితి రావు హైదరి.
అదితిరావు హైదరి తాత అక్బర్ హైదరీ. ఈయన హైదరాబాద్‌కు ప్రధానమంత్రిగా పనిచేశారు. మరో తాత రామేశ్వరరావు (తల్లికి తండ్రి) తెలంగాణలోని వనపర్తికి చెందినవారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, అదితికి దగ్గరి బంధువు. అదితికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అందుకే ఆమె తన తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది.
ఇక కెరీర్ విషయానికొస్తే అదితి రావు హైదరీ 2006లో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తరువాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. సిద్ధార్థ్, అదితి కలిసి ‘మహాసముద్రం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇటీవలే అదిథిరావు పూర్వీకుల సంస్థానం పరిధిలో ఉన్న ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అదితి సినిమాలకు పూర్తిగా దూరమైంది. 2022 తర్వాత ఈ చిన్నది మళ్లీ వెండి తెరపై కనిపించలేదు.