Viral Video: పెళ్లి వేదికపై పొట్టు పొట్టు కొట్టుకున్న వధూవరులు.. కానీ ఏదో తేడా కొడుతోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది నెట్టింట్లో ఓ హాట్ టాపిక్‌గా మారుతోంది.
Viral Video: పెళ్లి వేదికపై పొట్టు పొట్టు కొట్టుకున్న వధూవరులు.. కానీ ఏదో తేడా కొడుతోంది.
Viral Video: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది నెట్టింట్లో ఓ హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. కొన్నిసార్లు సహజంగా జరిగే సంఘటనలు నవ్వులు పుట్టిస్తే, మరికొన్ని కావాలనే స్క్రిప్ట్‌తో చేసినట్లుంటాయి. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగిన హాస్యాస్పద సంఘటన అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే వధువు వరుడి ఆశీర్వాదం తీసుకోవాలని కాళ్లు మొక్కేందుకు ముందుకు వంగుతుంది. అయితే వరుడు.. భార్యను ఆటపట్టించేందుకు ఆమె వంగగానే ఒక్కసారిగా వెనక్కు జంప్ చేస్తాడు. మొదటిసారి విఫలమైనా వధువు మళ్లీ ప్రయత్నిస్తుంది. ఈసారి కూడా వరుడు వేగంగా వెనక్కు జరగడంతో ఆమెకు కోపం వస్తుంది.
కాళ్లు పట్టుకుని ఒక్కసారిగా అతడిని కింద పడేస్తుంది. దీంతో వరుడు ఒక్కసారిగా వధువుపై దాడికి దిగుతాడు. దీంతో ఈ విషయం కాస్త పెద్ద గొడవకు దారి తీస్తుంది. వధువు కాలితో వరుడిని తన్నేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ జంట కలిసి ఉండడం కష్టమే అంటూ కొందరు స్పందించగా.. మరికొందరు మాత్రం ఇది కచ్చితంగా స్క్రిప్ట్‌తో చేసిన వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.