Soviet Satellite: భూమికి పోంచి ఉన్న భారీ ముప్పు..! ఆ నగరాలు సర్వనాశనం అవ్వనున్నాయా?
Soviet Satellite: ఉదయాన్నే లేచి వార్తలు చూస్తే భయం వేసింది. భూమిని ఢీకొట్టేలా ఒక పెద్ద శాటిలైట్ అదుపు తప్పి ఎర్త్‌వైపు దూసుకొస్తోంది.
Soviet Satellite: భూమికి పోంచి ఉన్న భారీ ముప్పు..! ఆ నగరాలు సర్వనాశనం అవ్వనున్నాయా?
Soviet Satellite: ఉదయాన్నే లేచి వార్తలు చూస్తే భయం వేసింది. భూమిని ఢీకొట్టేలా ఒక పెద్ద శాటిలైట్ అదుపు తప్పి ఎర్త్‌వైపు దూసుకొస్తోంది. ఇది మామూలు విషయం కాదు. శాస్త్రవేత్తలు కూడా ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎంత తీవ్రతతో పడుతుందో ఖచ్చితంగా చెప్పలేని స్థితి. కాస్మోస్-482 అనే శాటిలైట్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించనుంది.
కెనడాలో పడుతుందా?
1972లో సోవియట్ యూనియన్ వదిలిన ఈ శాటిలైట్ వాస్తవానికి వీనస్ మీద ల్యాండ్ అవ్వాల్సింది. కానీ ప్రయోగంలో సమస్యలు తలెత్తడంతో అది భూమి చుట్టూ తిరుగుతూ 53 ఏళ్లుగా కక్ష్యలోనే ఉంది. దీని ల్యాండర్ బరువు సుమారు 495 కిలోలు. తాజాగా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఇది 2025 మే 9 లేదా 10న భూమి వాతావరణాన్ని తాకే అవకాశం ఉంది. గంటకు సుమారు 242 కిలోమీటర్ల వేగంతో ఇది పడే అవకాశం ఉంది. ఇది లండన్, కెనడా నుంచి కేప్ హార్న్ వరకు ఎక్కడైనా పడే అవకాశం ఉన్నప్పటికీ, భూమి మీద 70 శాతం సముద్రమే ఉండడంతో ఇది నీటిలోనే పడుతుందనే అంచనా కూడా ఉంది. కానీ ఇది నగరాల మీద పడితే మాత్రం పరిణామాలు భయపడేలా ఉంటాయి.
భూమిని ప్రభావితం చేస్తుందా?
ఇక కాస్మోస్-482 వంటి శాటిలైట్‌లు భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో తీవ్రంగా రేఖాగతి మార్పుకు గురవుతాయి. భూమి వాతావరణపు గట్టితనాన్ని ఎదుర్కొంటూ వచ్చే వీటి వేగం గంటకు 24,000 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చు. ఈ వేగంతో వస్తున్న శాటిలైట్ భయంకరమైన ఘర్షణను ఎదుర్కొంటుంది. దీని వల్ల భారీగా ఉష్ణోగ్రతలు (2000°C కి పైగా) ఉత్పన్నమవుతాయి. శాస్త్రవేత్తల ప్రకారం, శాటిలైట్ పూర్తిగా వాతావరణంలో కాలిపోవచ్చు. కానీ దీనిలోని కొన్ని భాగాలు ఉన్నాయి. టిటానియం, స్టీల్ లాంటి గట్టి లోహాలతో తయారైనవి. కాలిపోకుండా భూమివరకు చేరే అవకాశం ఉంది. 495 కిలోల బరువు ఉన్న ల్యాండర్‌లో పూర్తిగా కరిగిపోని భాగాలు ఉంటే, అవి భూమిపై పడే స్థలాన్ని ప్రభావితం చేయవచ్చు.
స్పేస్ వేస్టేజీ అతిపెద్ద సమస్య:
ఇక్కడ అసలు సమస్య స్పేస్ వేస్టేజ్. మనం గతంలో పంపిన శాటిలైట్స్, రాకెట్ శకలాలు, మిషన్ల అవశేషాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటి మొత్తం సంఖ్య 46,000 పైగా ఉంది. ఇవి స్పేస్‌లో కొత్తగా ప్రయోగించనున్న ఉపగ్రహాలకు, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లకు ప్రమాదకరంగా మారాయి. అప్పుడప్పుడు ఇవి భూమిపైనా పడుతున్నాయి. ఇటీవలే కెన్యాలో, అమెరికాలో, కెనడాలో ఇలాంటివి నమోదయ్యాయి. ఈ పరిస్థితులు చూస్తే స్పేస్ వేస్టేజ్ సమస్య ఓ దేశానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు చురుకుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పట్లో అయినా దీనిపై ఒక స్థిరమైన సమాధానం కనుగొనాలంటే ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు కలసి పనిచేయాల్సిందే. ఇక ఆ శాటిలైట్ సముద్రంలో పడిపోవాలని కోరుకోవడమే మనం చేయగలిగేది.