Viral Video: రాధేశ్యామ్‌లో 'పూజా'లా చేద్దామనుకుంది.. కానీ ఊహించని ఘటన..!

Viral Video: ప్రస్తుతం రీల్స్‌, సెల్ఫీల పిచ్చి పెరిగింది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో లైక్‌లు, కామెంట్స్‌ కోసం చాలా మంది ఇలాంటి పోస్టులు చేస్తున్నారు.

Update: 2024-12-13 05:17 GMT

Viral Video: రాధేశ్యామ్‌లో 'పూజా'లా చేద్దామనుకుంది.. కానీ ఊహించని ఘటన..!

Viral Video: ప్రస్తుతం రీల్స్‌, సెల్ఫీల పిచ్చి పెరిగింది. సోషల్‌ మీడియా(Social Media) విస్తృతి పెరిగిన నేపథ్యంలో లైక్‌లు, కామెంట్స్‌ కోసం చాలా మంది ఇలాంటి పోస్టులు చేస్తున్నారు. అయితే కొంతమేర ఇలాంటివి బాగానే ఉన్నా కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రాణాల మీదికే వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కూడా సోషల్‌ మీడియా వేదికగానే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా వచ్చిన రాధేశ్యామ్‌(Radhe Shyam) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ప్రాణాతంక వ్యాధితో బాధపడే పూజా హెగ్డే.. ఎలాగో చనిపోతానని తెలిసి భయం లేకుండా జీవిస్తుంటుంది. ఇదే క్రమంలో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో బయటకు తల పెట్టి ఓ ఫీట్‌ చేస్తుంది గుర్తుంది కదూ! అచ్చంగా ఇలాంటి ఫీట్‌నే చేయాలని ఓ యువతి ట్రై చేసింది. అయితే ఇది కాస్త తేడా కొట్టింది.

వివరాల్లోకి వెళితే.. చైనా(China)కు చెందిన ఓ యువతి ఇటీవల శ్రీలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైల్లో ప్రయాణిస్తూ..బోగి తలుపు వద్ద ప్రమాదకరంగా నిలబడి వీడియోకు పోజులిచ్చింది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న కొన్ని చెట్ట కొమ్మలు తగిలి రైలులో నుంచి కింద పడిపోయింది. ఇదంతా సదరు వీడియోలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఆ యువతి కింద పడిపోయిన కాసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన ఆమె స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. యువతి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీల్స్‌ అంటే ఏదో సరదాగా ఉండాలి కానీ ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకోవడం అవసరమా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News