Viral Video: మనుషులే కాదు కారం తింటే కోతుల పరిస్థితి ఇంతే.. వైరల్ వీడియో
మనుషులే కాదు కారం తింటే కోతుల పరిస్థితి ఇంతే.. వైరల్ వీడియో
Monkey eats mirchi video: నోట్లో ఎండు మిర్చి వేసుకొని నమిలితే ఎలా ఉంటుంది? భరించలేని కారంతో ఉఫ్ఫు ఉఫ్ఫుమంటూ ఊదాల్సిందే. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు జంతువులు సైతం ఇలాగే రియాక్ట్ అవుతాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోనే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఓ కోతి చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ కోతి అంతలా ఏం చేసిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
సాధారణంగా అడవులు, కొండలు ఉండే పర్యాటక ప్రదేశాల్లో కోతులు ఉంటాయని తెలిసిందే. పర్యాటకులు వచ్చిన వెంటనే కోతులు గుంపుగుంపులుగా వచ్చేస్తుంటాయి. పర్యాటకుల చేతుల్లో ఉన్న వస్తువులను లాక్కుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కోతి పర్యాటకుడి చేతిలో నుంచి ఓ డబ్బాను ఎత్తుకొచ్చింది. డబ్బాను తెరిచి చూసే సరికి అందులో ఎర్రటి మిర్చి కనిపించింది. అయితే కోతి దానిని చూసి క్యారెట్ అనుకుందో మరెంటో కానీ వెంటనే దానిని తీసుకొని నోట్లో వేసుకుంది.
దీంతో ఒక్కసారిగా మంట పుట్టింది. అచ్చంగా మనుషుల్లాగే ఊదుకుంటూ చాలా ఇబ్బంది పడింది. కారాన్ని ఎంతకూ భరించలేని కోతి నోటిని నేలపై రుద్దేసింది. అయినా మంట తగ్గలేదు కాబోలు పర్యాటకులపై ఓ రేంజ్‌లో కోపాన్ని ప్రదర్శించింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు టూరిస్టులు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
క్షణాల్లో వీడియో ట్రెండ్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కోతి కోపంగా ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మనుషుల్లాగే కోతులు కూడా కారం తింటే ఇలాగే చేస్తాయా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.