Viral Video: అన్న ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో

Viral Video of a cyclist: వర్షం పడితే రోడ్లు ఎలా మారుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గల్లీల్లో ఉండే రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోతాయి. దీంతో ఆ ప్రదేశం గుండా నడవాలంటే ఇబ్బందిగా మారుతుంది.

Update: 2025-01-27 15:34 GMT

అన్న ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో

Viral Video of a cyclist: ఏమంటూ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో ఎక్కడ లేని వింతలు నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అందరి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో? అందులో ఏముందో తెలియాలంటే ఈ డీటేయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

వర్షం పడితే రోడ్లు ఎలా మారుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గల్లీల్లో ఉండే రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోతాయి. దీంతో ఆ ప్రదేశం గుండా నడవాలంటే ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి ఘటనే ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి కూడా ఎదురైంది. సైకిల్‌‌పై వెళ్తున్న ఆ వ్యక్తి గల్లీ నిండా నీరు ఉండడం గమనించాడు. సైకిల్‌ తొక్కుతూ ఆ గల్లీ గుండా వెళ్లడం కష్టం. అలా అని కింద నీటిలో నడుచుకుంటూ వెళ్తే కాళ్లు తడిచిపోతాయి.

ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే అతను ఒక వినూత్న ఆలోచన చేశాడు. సైకిల్‌ను నీటి నుంచీ తీసుకెళ్తూ.. కాళ్లు తడవకుండా గోడపై కాళ్లతో నడుచుకుంటూ వెళ్లాడు. అలా ఆ గల్లీ మొత్తం నడుస్తూ వెళ్లిపోయాడు. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడం మొదలైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ వ్యక్తి కోసం నాసా వెతుకుతోంది అనే క్యాప్సన్‌తో వీడియోను పోస్ట్‌ చేయగా. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అన్న తెలివికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ ఒక యూజర్‌ స్పందించగా మరికొందరు చెప్పులు పాడు కావొద్దని ఇతను చేసిన ఐడియా భలే ఉందంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు చేతిలో సైకిల్ ఉండగా... సాఫీగా సైకిల్ తొక్కుతూ వెళ్లకుండా ఈ స్టంట్స్ చేయడం ఎందుకు అని ఇంకొంతమంది యూజర్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

Tags:    

Similar News