Viral Post: 50 సర్టిఫికేట్స్‌.. 10 మెడల్స్‌.. అయినా ఇంటర్నెషిప్‌ కూడా లేదు..!

Viral Post: ఇలా చూస్తే, బిస్మా పోస్ట్‌ ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ కాదు.. చదువుతో పాటు జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చే అవకాశమైంది.

Update: 2025-04-20 03:30 GMT

Viral Post: 50 సర్టిఫికేట్స్‌.. 10 మెడల్స్‌.. అయినా ఇంటర్నెషిప్‌ కూడా లేదు..!

Viral Post: ఓ కాలేజ్ టాపర్‌కు ఇంటర్న్‌షిప్ రాలేదంటే ఎంత అసహనం కలుగుతుందో అనిపించిందేమో... అందుకే ఒక హన్స్రాజ్ కాలేజ్ విద్యార్థిని సోషల్ మీడియాలో తన అనుభవాన్ని ఓపెన్‌గా పంచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న బిస్మా అనే విద్యార్థిని లింక్డ్ఇన్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

బిస్మా చదివేది ఇంగ్లిష్ ఆనర్స్. ఫస్ట్ ఇయర్‌లోనే టాపర్‌గా నిలిచిన ఆమెకు, ఏ ఇంటర్న్‌షిప్‌ కంపెనీ నుంచీ ఒక్క ఆఫర్ కూడా రాలేదట. ఎంతటి చదువు ఉన్నా, మార్కులున్నా సరిపోవు...నైపుణ్యాలు లేకుంటే అవకాశం దక్కదన్న ఆమె మాటలు నేరుగా విద్యార్థుల గుండెల్లో తాకాయి.

పుస్తకాలు, పాఠశాలలు, బోధనలే అంతం అనుకున్న తల్లిదండ్రుల సమాజాన్ని ఆలోచనలో పడేసేలా ఉంది ఆమె పోస్ట్. సర్టిఫికెట్లు, మెడల్స్, ట్రోఫీలు అంతా ఉన్నా... ఒక్క ఇంటర్న్షిప్ ఆఫర్ లేకపోవడాన్ని బిస్మా అసహనంగా కాకుండా, నిజాయతీగా అంగీకరించింది. తన తల్లిదండ్రులు, అధ్యాపకులు చెప్పిన "పడుకుంటే చాలు.. చదువు నీ జీవితాన్ని మార్చేస్తుంది" అనే మాటలు, ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు పనికిరాలేదని తెలిపింది.

వాస్తవంగా చూస్తే, ఈ పోస్ట్ ఒక్కరిపై కాకుండా, చదువులో రాణించిన ఎంతో మంది విద్యార్థుల మనోభావాలకు ప్రతిరూపంగా మారింది. మంచి మార్కులు రావడమే సర్వస్వం అనుకునే విద్యార్థులకు, బిస్మా పోస్ట్ ఒక గట్టి సిగ్నల్‌లా ఉంది. తానేంటో అర్థం చేసుకోవాలంటే బుక్‌లతో పాటు స్కిల్స్‌ కూడా అవసరమని చెబుతోంది. తన అనుభవాన్ని పంచుకుంటూ, 'ఒక స్కిల్‌ను ఎంచుకోండి, దానిని నేర్చుకోండి, మీరు ఎలా మారుతున్నారో చూడండి' అని సూచించింది. కొంతమంది నెటిజన్లు ఆమె పోస్ట్‌ను తల్లిదండ్రులకు షేర్ చేస్తామని కామెంట్ చేయగా, మరికొందరు 'ఈ పోస్ట్ నిజంగా సమాజానికి అవసరమైన మెసేజ్' అని అభిప్రాయపడ్డారు.

ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, పాఠశాలలో, కాలేజీలో బ్యాక్‌బెంచర్‌గానే ఉండేవాడిని, కానీ స్కిల్స్‌ను డెవలప్ చేసి, ప్రాజెక్ట్స్ చేసి, ఫ్రీలాన్సింగ్ ద్వారా నేర్చుకున్న అనుభవమే తన కెరీర్‌ను మలిచిందని వివరించాడు. ఇలా చూస్తే, బిస్మా పోస్ట్‌ ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ కాదు.. చదువుతో పాటు జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చే అవకాశమైంది. మార్కుల ప్రపంచం బయట కూడా ఒక రియల్ వరల్డ్ ఉంటుందని, అది స్కిల్స్‌తోనే నడుస్తుందని కొత్త తరం ఇప్పుడు అర్థం చేసుకుంటోంది.

Tags:    

Similar News