Viral News: టైమ్ రిపీట్ అవుతోందా.? 1941, 2025 అచ్చుగుద్దినట్లు ఒకేలా
Viral News: ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఓ ఆసక్తికరమైన విషయానికి సంబంధించి వైరల్ అవుతోంది. "2025 సంవత్సరం 1941 వ సంవత్సరం ఒకేలా ఉన్నాయి. అన్నది సదరు వార్త సారంశం.
Viral News: టైమ్ రిపీట్ అవుతోందా.? 1941, 2025 అచ్చుగుద్దినట్లు ఒకేలా
Viral News: ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఓ ఆసక్తికరమైన విషయానికి సంబంధించి వైరల్ అవుతోంది. "2025 సంవత్సరం 1941 వ సంవత్సరం ఒకేలా ఉన్నాయి. అన్నది సదరు వార్త సారంశం. ఈ రెండు సంవత్సరాల్లో తేదీలు, వారాలు అన్నీ ఒకేలా ఉంటాయి. జనవరి 1 తేదీ బుధవారం రాబడమే కాక, సంవత్సరం అంతా అన్ని తేదీలు అదే విధంగా సరిపోతాయని అంటున్నారు.
ఈ విషయం చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు, మరికొందరు భయపడుతున్నారు కూడా. ఎందుకంటే 1941 సంవత్సరం అనేది ప్రపంచ యుద్ధానికి శ్రీకారం చుట్టిన సంవత్సరం. అమెరికా పెర్ల్ హార్బర్ మీద జరిగిన దాడి తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఈ రెండు సంవత్సరాలు ఒకేలా ఉండటం వాస్తవమేనా?
2025 క్యాలెండర్ 1941 క్యాలెండర్‌తో సరిపోవడం నిజమే. ఆ సంవత్సరాల్లో రోజులు, తేదీలు ఒకేలా ఉంటాయి. కానీ ఇది ఎటువంటి భవిష్యత్ భవిష్యవాణి కాదు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ వ్యవస్థలోనే సహజంగా జరిగే విషయం.
లీప్ సంవత్సరాలు, వారాల మార్పులు ఇవన్నీ ఒక నియమిత సరళిలో జరుగుతుంటాయి. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మునుపటి క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఇలాంటిది గతంలోనూ జరిగింది.
మరి ఇప్పుడే భయం ఎందుకు.?
ఇతర సంవత్సరాల క్యాలెండర్ మ్యాచ్‌ల కన్నా, 1941 అనే సంవత్సరం ప్రత్యేకంగా చర్చకు రావడం ఒక్కటే కారణం – అది చరిత్రలో కీలకమైన ఘర్షణలు జరిగిన సంవత్సరం కావడం. అప్పటికి యూరప్‌లో యుద్ధం నడుస్తోంది. పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి తర్వాత అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఆ తరువాత జరిగిన ఘోర విధ్వంసాలు ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నాయి. ఇప్పటి ప్రపంచ పరిస్థితుల మధ్య 1941 క్యాలెండర్ మళ్ళీ రావడం కొందరికి అసహజంగా అనిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో ప్రపంచం గందరగోళంగా మారుతోంది యుద్ధాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక ఒడిదుడుకులు వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తల్లో నిజం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం శాస్త్రీయత లేదని వాదిస్తున్న వారు కూడా ఉన్నారు. మాయన్ క్యాలెండర్ ప్రకారం 2012లో ప్రపంచం అంతమవుతుందన్న గందరగోళం గుర్తుండే ఉంటుంది. కానీ ఏం జరిగిందీ? – ఏమీలేదు! కాబట్టి ఇప్పుడు కూడా ఎలాంటి దుర్ఘటనలు జరగవు అని అభిప్రాయపడుతున్నారు.