సమయాన్ని సమయస్పూర్తితో వాడుకోండి ఇలా!

Update: 2019-08-14 06:17 GMT

ఈ సృష్టిలో మనిషికి అందుభాటులో వున్న వనరులలో ఒక ముఖ్యమైన వనరు సమయం, అలాగే చిత్రమైన వనరు.. సమయం లేదా కాలం అని అనవచ్చు. ఇది ఉచితంగా లభిస్తుంది కాబట్టి చాలామందికి దీని విలువ తెలియక పోవచ్చు, కాని ఇది అమూల్యం. ఈ సమయం నీ సొంతంగా అనిపించినా అది ఎవరి సొత్తు కాదు అని, కొంత వయస్సు రాగానే మనకి అర్ధం అవుతుంది. అలాగే దాని వినిమయం మీ ఇష్టమైన పనుల మీద పెడుతున్నారా లేదా అనవసరంగా వృధా చేస్తున్నారా అనేది ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి. ఖర్చు చేసిన కాలము ఒక్క నిమిషం కూడా తిరిగి రాదు కదా. కాబట్టి మన చేతిలోని సమయాన్ని సరిగ్గా వాడుకోవడం చాల ముఖ్యం. దాని కోసం ఒక నాలుగు పద్దతులు మనకి సహాయ పడుతాయి. అవి..

మొదటిది... ముఖ్యమైన పనులను గుర్తించాలి: మనం చెయ్యాల్సిన పనులు ఎన్నో వున్నట్టు మీకు అనిపించవచ్చు, ప్రతి పని అర్జెంటు పని లా కూడా అనిపించవచ్చు, కాని ఒక పని అర్జెంట్ అని మాత్రమే మీరు చెయ్యవద్దు. ఆ పని మీకు ఇంపార్టెంట్ అవునా, కాదా అని కూడా చెక్ చేసుకోవాలి. రెండవది... ప్రాధాన్యత ప్రకారం చెయ్యాలి: మీ పనులన్నీ ఒక పేపర్ పై వ్రాసుకొని, వాటి యొక్క ప్రాదాన్యత క్రమంలో అమర్చుకోవాలి. అన్ని పనుల్లో కొన్ని పనులు ముఖ్యం అనిపించిన వాటిని ఒక దగ్గర వ్రాసిన తర్వాత, వాటికీ ప్రాధాన్యత క్రమంలో రాసుకోవాలి.

మూడవది... అనవసరమైన పనులకు దూరంగా వుండాలి: చాల మంది మొహమాటంతో లేదా ఎక్కువగా వారి సమయం గురించి ఆలోచించకుండా వారి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అలా జరగవద్దు అనుకుంటే, మీకు అనవసరం అనిపించినా, మీ లక్ష్యానికి సంభంధం లేని అన్ని పనులను దూరం పెట్టండి. నాలుగవది... బద్దకాన్ని వదిలించుకోవాలి: చాల వరకు సమయం వృధా కావడానికి ఒక ముఖ్య కారణం మనిషి లోని బద్ధకం, కాబట్టి ఆ బద్దకాన్ని మనం ముందుగా జయించాలి. ఎప్పటి పనిని అప్పుడే చెయ్యడం ద్వార మీరు మీ బద్దకాన్ని జయించవచ్చు. అలా పైన మాట్లాడుకున్న నాలుగు విషయాలు మీరు ఆచరణలో పెట్టి విజేతలుగా నిలవవచ్చు. అల్ ది బెస్ట్. 

Tags:    

Similar News