కష్టంతో చేస్తారా?ఇష్టంతో చేస్తారా?

సైన్స్‌ మాస్టారు తన క్లాసు లోని ఒక విద్యార్థిని అడుగుతున్నాడు. '' రవీ! కన్ను, ముక్కు, చెవి వల్ల మనకు వున్నా ఉపయోగలేమిటి?'' వెంబడే.. రవి అన్నాడు... '' కళ్లతో అన్నీ చూడొచ్చు, ముక్కుతో శ్వాస పీల్చవచ్చు. చెవులు మీరు గుంజడానికి, మెలిపెట్టడానికి బాగా పనికివస్తాయి సార్‌..!'' అని అన్నాడు.

Update: 2019-09-11 11:03 GMT

సైన్స్‌ మాస్టారు తన క్లాసు లోని ఒక విద్యార్థిని అడుగుతున్నాడు.

'' రవీ! కన్ను, ముక్కు, చెవి వల్ల మనకు వున్నా ఉపయోగలేమిటి?''

వెంబడే.. రవి అన్నాడు... '' కళ్లతో అన్నీ చూడొచ్చు, ముక్కుతో శ్వాస పీల్చవచ్చు. చెవులు మీరు గుంజడానికి, మెలిపెట్టడానికి బాగా పనికివస్తాయి సార్‌..!'' అని అన్నాడు.

ఒకప్పుడు విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టె బాగంగా రకరకాల శిక్షలను విధించేవారు ఉపాద్యాయులు. అయితే ఈ రోజుల్లో ఆ పద్దతి చాల వరకు తగ్గి పోయింది. అలాగే అలాంటి విధానాలను తల్లి తండ్రులు కూడా ఒప్పుకోవట్లేదు. అయితే శారీరకంగా కొంత శిక్షించకుండా విద్యార్థికి సరైన క్రమశిక్షణ అలవడుతుందా అనేది ఒక చర్చనీయాంశం. అయితే ఒక వ్యక్తిలో సరైన మార్పు తీసుకురావటంలో Pain and Pleasure రెండు కూడా చాల బాగా పని చేస్తాయని ఎన్నో పరిశోధనలు చెపుతున్నాయి. అయితే నొప్పి వలన వచ్చే మార్పు కొంతకాలమే వుంటుంది అని మనం అర్ధం చేసుకోవాలి. నొప్పి తగ్గగానే వ్యక్తి గత ప్రవర్తనకి వెళ్ళవచ్చు. కాని Pleasure వలన వచ్చే మార్పు ఎక్కువ రోజులు నిలుస్తుంది. కాబట్టి ఈ విధానంలో విద్యార్థికి మీరు చెపుతున్న విషయం వలన లాభం ఏంటి, దానివలన ఎలాంటి ఉపయోగం వుంటుంది, ఇలాంటి విషయాలను అర్ధ్డం చేయించడం వలన ఎంతో లాభం వుంటుంది. ఇలా ఎదుటి వ్యక్తిలో మనం మార్పుని సాధించవచ్చు. ఇది ఆచరణలో సాద్యమా? అని మీరు అడగవచ్చు. మాటలలోనే కాకుండా ఆచరణలో పెడితే ఇది సాధ్యమే, లేకుంటే ఈ జోక్ లా జరుగుతుంది.

సుమక్క...... ఈ వేళ ఉదయం మీ అబ్బాయి రాళ్ళు విసిరికొట్టి, మా కిటికీ అద్దాలు పగలగొట్టాడు. వాణ్ణి ఏం చేయాలంటారు..?'' అని కోపంగా అడిగింది శారద.

'' కోప్పడకండి... పిల్లలన్న తర్వాత అల్లరిచేయకుండా ఉంటారా? వాళ్ళు ఏదైనా తప్పుచేస్తే శిక్షించడం కాకుండా, మంచి మాటలు చెప్పి, ఆ తప్పు మరోసారి చేయకుండా చూడాలి..'' నచ్చచెప్పింది సుమ.

'' అయితే ఓకే... నిజానికి అద్దాలు పగలకొట్టింది మా అబ్బాయి . పగిలింది మీ కిటికీల అద్దాలు అంది.. గడుసు..శారద. 

Tags:    

Similar News