Viveka Murder Case: ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలన్న సుప్రీంకోర్టు
Viveka Murder Case: వివేకా హత్యకేసులో విచారణ వేగవంతం చేయాలని ఆదేశం
Viveka Murder Case: ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలన్న సుప్రీంకోర్టు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని, ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశించింది. ఇక.. దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను తప్పించిన సీబీఐ.. కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ముందు ప్రతిపాదన పెట్టింది. కొత్త సిట్‌లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉన్నారు. ఇక.. సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఈ కొత్త సిట్ పనిచేస్తుందని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 6 నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.