ఆ లక్షమందిని ఖ్వారంటైన్ వార్డులకు తీసుకెళ్లండి : సీఎం యోగి ఆదిత్యనాథ్

గత మూడు రోజులుగా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి చేరుకున్న సుమారు లక్ష మంది వలస కార్మికులు, ప్రజలను క్వారంటైన్ వార్డులలో నిర్బంధించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2020-03-29 03:40 GMT
yogi adityanath

గత మూడు రోజులుగా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి చేరుకున్న సుమారు లక్ష మంది వలస కార్మికులు, ప్రజలను క్వారంటైన్ వార్డులలో నిర్బంధించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి లక్ష మంది యూపీకి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు . వారి పేర్లు, చిరునామాలు మరియు ఫోన్ నంబర్లను జిల్లా న్యాయాధికారులకు అందుబాటులో ఉంచారు మరియు వాటిని ఆయన పర్యవేక్షిస్తున్నారు.

లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి.. వీరందరిని నిర్బంధంలో ఉంచి .. వారి ఆహారం మరియు ఇతర రోజువారీ అవసరాలను తీర్చాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ తన నివాసంలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ నిరాశ్రయులకు ఆహరం మరియు ఇతర వస్తువులను సరఫరా చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఢిల్లీ - ఉత్తర ప్రదేశ్ సరిహద్దు మీదుగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు భారీగా ఈ బోర్డర్ వద్దకు తరలివచ్చారు. ట్రాన్స్ పోర్ట్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు కాలినడకన, సరిహద్దును దాటి వారి గమ్యస్థానాలకు వెళుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారు. అయితే ఘజియాబాద్‌లోని లాల్కువాన్ నుంచి బస్సులు తిరుగుతాయని కార్మికులకు ముందుగా సమాచారం అందడంతో వారంతా బయలుదేరారు.. తీరా బస్సులు తిరగక పోవడంతో కాలినడకనే బయలుదేరారు.. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు యుపి సరిహద్దు వద్ద భారీగా జనం గుమిగూడారు. భారీ జనాన్ని చూసిన స్పీ, ఎడిఎం అక్కడికక్కడే సరిహద్దులో ఉన్న ప్రజలను నిలిపివేశారు. దీంతో కార్మికులకు ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక అక్కడే ఉండి పోయారు. వారిని ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖ్వారంటైన్ వార్డులలో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు.


Tags:    

Similar News