లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే కేంద్రం వదిలేస్తుందా?
కరోనా మహమ్మారి నుంచి భారతదేశ ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
కరోనా మహమ్మారి నుంచి భారతదేశ ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.శనివారం ఆయా రాష్ట్రాల ముఖమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్రం అనుసరించబోయే కొత్త వ్యూహానికి అద్దం పడుతున్నాయి. మూడు వారల లాక్ డౌన్ దేశ ఆర్ధిక వ్యవస్థను షేక్ చేసింది. రాష్టాల ఖజానాలు నిండుకుంటున్నాయి.
ప్రభుత్వం ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ధిక వ్యవస్థమీద ద్రుష్టి పెట్టకపోతే భవిశ్యత్ లో ప్రమాదమే అని గుర్తించింది. అందుకే లాక్ డౌన్ విషయంలో కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. జాన్ బీ జహాన్ బీ తరహాలో లాక్ డౌన్ పొడిగించే విషయాన్నీ రాష్ట్రాలకే వదిలేయాలని ఆలోచన చేస్తోంది.
దేశవ్యాప్తంగా ఒకే వ్యూహాన్ని అమలు చేయడం కంటే ఆయా రాష్ట్రలో కరోనా తీవ్రతను భట్టి అక్కడి ప్రభుత్వాలకే నిర్ణయాధికారాన్ని వదిలేయాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో చాలా సీరియస్ గా ఉన్నాయి.
కేంద్రం ప్రకటనతో సంబంధం లేకుండా లాక్ డౌన్ ను ఈ రాష్ట్రాలు ఇప్పటికే పొడిగించాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ను పొడిగించడానికి సిద్ధంగా లేదు.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లకు మాత్రమే లాక్ డౌన్ ను పరిమితం చేస్తే సరిపోతుంది అన్నది సీఎం జగన్ ప్రతిపాదన.. ఇదే తరహా ప్రతిపాదన కేరళ కూడా వెలియబుచ్చింది.
జిల్లాల వారీగా సమీక్ష చేసి.. లాక్ డౌన్ విధింపు, తొలగింపు ఉండాలి అన్నది కేరళ వ్యూహం.. ఇక లాక్ డౌన్ ను ఏఏ రంగాలపై కొనసాగించాలి, ఎక్కడెక్కడ తొలగించాలి అని బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు అధికారులు.
ఇదిలావుంటే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తరువాత మరో రెండు వారాల పాటు పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ విస్తరించాల్సిన అవసరాన్ని కేంద్రం మరియు చాలా రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిసింది, అయితే, అయితే ఇందులో కొంత సడలింపులు ఉండే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.