Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో అడవి ఏనుగుల బీభత్సం
Kerala: 'ఆపరేషన్ అరికొంబన్'పై స్టే విధించిన హైకోర్టు
Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో అడవి ఏనుగుల బీభత్సం
Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొంతకాలంగా అడవి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు, తోటల్లోకి ప్రవేశించి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల గుంపును బెదిరించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల వల్ల అనేక ఎకరాల్లో పంటలు ధ్వంసం అయినట్లు వెల్లడించారు. సమీప ప్రాంతాల్లో స్థానికులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు అడవి ఏనుగులను పట్టుకునేందుకు 'ఆపరేషన్ అరికొంబన్'పై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పుపై ఇడుక్కి జిల్లాలలోని 13 పంచాయతీల ప్రజలు 12గంటల పాటు నిరసనకు పిలుపునిచ్చాయి.