ఈ ఏడాది భారీ స్థాయిలో గోధుమల దిగుబడి.. లాక్ డౌన్ ఉన్నా ఇబ్బంది లేదు.

ప్రస్తుతం లాక్ డౌన్ మరికొన్ని రోజులు కొనసాగినా భారత్ లో సరిపడా ఆహార ధాన్యాలు పరిపుష్ఠిగా ఉన్నాయి.

Update: 2020-04-15 02:24 GMT

ప్రస్తుతం లాక్ డౌన్ మరికొన్ని రోజులు కొనసాగినా భారత్ లో సరిపడా ఆహార ధాన్యాలు పరిపుష్ఠిగా ఉన్నాయి. ఈ రబీ సీజన్లో గోధుమ, బంగాళాదుంప-ఉల్లిపాయలు బంపర్ దిగుబడిని ఆశించవచ్చు. గోధుమల దిగుబడి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 106.2 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అంటే గత ఏడాది కంటే ఈసారి 4 మిలియన్ టన్నుల గోధుమలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి 6.30 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చగలదు. ఇది మాత్రమే కాదు, గోడౌన్లలో ఇప్పటికే గోధుమ , బియ్యం భారీ స్టాక్ ఉంది, కాబట్టి భవిష్యత్తులో కొద్దిరోజుల వరకూ ఆహార ధాన్యాలకు కొరత లేదు.

ఈ ఏడాది గోధుమలు అత్యధిక సంఖ్యలో దిగుబడి రావడంతో.. 90 వేల టన్నుల గోధుమలను ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం గోధుమలలో 85 నుంచి 90% వినియోగిస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

అంటే, సంవత్సరానికి సుమారు 90 మిలియన్ టన్నుల గోధుమలను దేశంలో వాడతారు.. మిగిలిన ఒకటిన్నర మిలియన్ టన్నుల గోధుమలు ఆదా అవుతాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే గోధుమలలో 83% ఐదు రాష్ట్రాలు. వీటిలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు హర్యానా ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు 17% ఉత్పత్తి చేస్తాయి.


Tags:    

Similar News