చలితో వణుకుతున్న ప్రజలు... అత్యల్ప ఉష్ణోగ్రత అక్కడే

చలి తీవ్రత రోజు రోజుకు పెరిపొతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలోకి లంబసింగి లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

Update: 2019-12-29 02:25 GMT
Delhi Cold Wave Persists

చలి తీవ్రత రోజు రోజుకు పెరిపొతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలోకి లంబసింగి లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంతేకాకుండా ఉత్తరాది రాష్ట్రాలను చలి గాలులు కమ్మేయటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇదే వాతావరణం శేలవు రోజు ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలైనా ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరపద్రేశ్, బిహార్‌లలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

కాగా.. దేశరాజధాని ఢిల్లీ చలితో వణికిపోయింది. ఈ సీజన్‌లో 118 ఏళ్ల తర్వాత ఢిల్లోనే అత్యంత చల్లటి వాతావరణం నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వాయు కాలుష్యంతో అల్లడిపోయిన ఢిల్లీ ప్రజలను చలి కూడా వణికిస్తుంది. దట్టంగా అలముకున్న పొగమంచు సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తుంది. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే మరింత దారుణంగా పడిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాలు, రైళ్లు, రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

అయితే పొగమంచు కారణంగా 24 రైళ్లు ఆలస్యంగా రైల్వేశాఖ నడుపుతోంది. విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలను మళ్లించారు. జమ్మూ-కశ్మీర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. . లేహ్‌, ద్రాస్‌లలో మైనస్‌ 19.1డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చలితీవ్రతకు తాళలేక ఓ వ్యక్తి మరణించాడు. ఇక దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఆంధ్రలాంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. 


Tags:    

Similar News