Viral Video: హరిద్వార్‌లో విషాదం తప్పిన జస్ట్ మిస్‌.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన సీసీ కెమెరాలో..!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఆచితూచి అడుగేయాల్సిన ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి కిందపడటంతో ముగ్గురు యువకులు తృటిలో మృత్యును తప్పించుకున్నారు.

Update: 2025-08-06 15:30 GMT

Viral Video: హరిద్వార్‌లో విషాదం తప్పిన జస్ట్ మిస్‌.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన సీసీ కెమెరాలో..!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఆచితూచి అడుగేయాల్సిన ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి కిందపడటంతో ముగ్గురు యువకులు తృటిలో మృత్యును తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌పై బరువైన రాళ్లు విరిగిపడి పడిపోయాయి. బైక్‌తో పాటు వారు కూడా కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తంగా స్పందించి వారిని శిథిలాల నుంచి బయటకు లాగి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

అంతేకాదు.. ఉత్తరకాశి జిల్లాలోని ధరాలీ గ్రామంపై ప్రకృతి ఉన్మాదం తన నరరూపాన్ని చూపించింది. అక్కడ మేఘాలు పేలిన (క్లౌడ్‌బర్స్ట్‌) దృష్ట్యా ఎగువ నుంచి వచ్చిన మట్టి నీటి ప్రవాహం వల్ల గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, హోమ్‌ స్టేలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా వ్యక్తులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

భారత ఆర్మీకి చెందిన 14 రాజ్‌రిఫ్‌ యూనిట్ బేస్ క్యాంప్ కూడా బురద ప్రవాహానికి గురైంది. దీంతో 10 మంది జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ జాడలేకపోయారు. అయినా తోటి జవాన్లు ధైర్యంగా మిగతా సహచరులను రక్షించేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 4 చిన్నారులు, 11 మంది మహిళలు, 22 మంది పురుషులను భద్రంగా బయటకు తీశారు.

ఇక హరిశీలా పర్వత సమీపంలోని సత్‌తాల్ వద్ద కుంభవృష్టి కారణంగా ఖీర్‌గంగా నది హద్దులు చెరిపేసి ఘాటుగా ప్రవహించింది. గంటకు 43 కిలోమీటర్ల వేగంతో వరద ప్రవాహం దిగువనున్న ధరాలీ గ్రామాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రమాద సమాచారంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక దళం, పోలీస్ బలగాలు, ఆర్మీ యూనిట్లు, ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్సు సహాయక చర్యల్లో తలమునకయ్యాయి.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.



Tags:    

Similar News