Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి..
Manipur: బిష్ణుపూర్ జిల్లా క్వాక్టాలో అర్ధరాత్రి కాల్పులు
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి..
Manipur: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టాలోకి అర్ధరాత్రి చొరబడ్డ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మిలిటెంట్ల దాడిలో ముగ్గురు మృతి చెందారు. దీంతో హింస చెలరేగి భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. మృతులు మైతేయి వర్గానికి చెందిన వారిగా సమాచారం. గ్రామంలో తమ ఇళ్లకు కాపలాగా ఉన్న సమయంలో గ్రామస్తులపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తండ్రి, కుమారిడితో సహా మరో వ్యక్తి చనిపోయారు. కాల్పుల్లో మణిపుర్ కమాండో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.