రైలు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి

Update: 2020-05-08 05:14 GMT

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు వెంకయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్ష‌తగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.

ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఛత్తీస్ ఘడ్ కు చెందిన వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోవడానికి రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్నారు. ఈ సమయంలో శుక్రవారం ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఔరంగబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



 


Tags:    

Similar News