యూపీలోని ఉన్నావ్‌లో ఉద్రిక్తత

Update: 2019-12-07 11:55 GMT
ఉన్నావ్‌

యూపీలోని ఉన్నావ్ లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బీజేపీ ఎంపీ, ఉప ముఖ్యమంత్రిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓ కార్యకర్త బీజేపీ ఎంపీ వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఉన్నావ్ బాధితురాలికి తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

బీజేపీ ఎంపీ, డిప్యూటీ సీఎంను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఉన్నావ్ బాధితురాలికి బీజేపీ అండగా ఉందని ఆ పార్టీ నాయకులు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని, నిందితులకు త్వరగా శిక్ష పడుతుందని తెలిపారు. నిందితులు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని, పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. 

Tags:    

Similar News