నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఉంటాయా?

నేడు (బుధవారం) కేంద్ర క్యాబినెట్ సమావేశం సాయంత్రం దేశ రాజధానిలోని ప్రధాన మంత్రి నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో జరగనుంది.

Update: 2020-04-15 03:25 GMT

నేడు (బుధవారం) కేంద్ర క్యాబినెట్ సమావేశం సాయంత్రం దేశ రాజధానిలోని ప్రధాన మంత్రి నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో జరగనుంది.అయితే, ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ మీటింగ్‌కు నిర్వహిస్తారా? లేఖ ఢిల్లీలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అవుతారా అనేది స్పష్టంగా తెలియరాలేదు. లాక్డౌన్ 2.0 గురించి ఎలా వెళ్లాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేస్తుందని పిఎం మోడీ చెప్పారు. సమావేశంలో దీనిపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది.

అలాగే కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు మూసివేయబడిన అన్ని పరిశ్రమలు, వివిధ రంగాల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

COVID-19 వ్యాప్తిని నిరోధించడానికి మే 3 వరకు దేశం లాక్డౌన్లో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏప్రిల్ 20 తర్వాత హాట్‌స్పాట్ లేని ప్రదేశాలలో లాక్‌డౌన్ పరిమితులను సడలించడం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. దీనిపై కూడా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News