మే 3 తర్వాత విమాన సర్వీసులు నడుస్తాయా..

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వ్యాప్తిని నిలువరించడానికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ మే 3న ముగియనుంది.

Update: 2020-04-19 09:41 GMT

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వ్యాప్తిని నిలువరించడానికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ మే 3న ముగియనుంది.అయినప్పటికీ రైలు, విమాన సర్వీసులు ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎయిర్‌ ఇండియా తన దేశీయ విమాన సర్వీసులను మే 4 నుంచి, అంతర్జాతీయ విమాన సర్వీలును జూన్‌ 1 నుంచి నడపనుందని, వాటికి సంబంధించి బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభించిందని శనివారం వార్తలు వచ్చాయి.

అయితే శనివారం, తన నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన మంత్రుల బృందం రైళ్లు, విమానాలను తిరిగి ప్రారంభించడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు వర్గాలు తెలిపాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన తర్వాత తుది పిలుపు తరువాత దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిందని భావించినట్టు తెలుస్తోంది.

అంతేకాదు తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అన్ని విమానయాన సంస్థలు మే 3 తర్వాత బుకింగ్ తీసుకోవద్దని మంత్రుల బృందం పేర్కొన్నట్లు సమాచారం. మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. రైలు , విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు దేశీయ లేదా అంతర్జాతీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే విషయమై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే విమానయాన సంస్థలు తమ బుకింగ్‌లు తెరవాలని అని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేసారు.


Tags:    

Similar News