Tomatoes Stolen: రూటు మార్చిన దొంగలు.. రూ. 2.5 లక్షల విలువైన టమాటాల చోరీ.. బోరుమన్న మహిళా రైతు

Tomatoes Stolen: కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి.

Arun Chilukuri
Published on: 6 July 2023 12:58 PM IST
Tomatoes Worth Rs 2.5 Lakhs Were Stolen From Farm in Karnataka
X

Tomatoes Stolen: రూటు మార్చిన దొంగలు.. రూ. 2.5 లక్షల విలువైన టమాటాల చోరీ.. బోరుమన్న మహిళా రైతు

Tomatoes Stolen: కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. టమాటాలు అయితే సెంచరీ కొట్టేయగా..ఇతర కూరగాయలు కూడా అదే బాటలో దూసుకెళ్తున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయోనని వినియోగదారులు ఆశగా చూస్తున్నారు. దీనితో ఈ సంక్షోభాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి షాపుల్లో, పొలాల్లో ఉన్న టమాటాలను లూటీ చేస్తున్నారు. అసలు టమాటా ధరలు ఈ రేంజ్ లో పెరుగుతాయని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు టమాటా పండించింది. ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబర పడింది. పంటకోసి మార్కెట్‌కి తీసుకెళ్దామని చూసే లోపు ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దుండగులు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story