నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. వీటిపైనే దృష్టి..‌

లాక్ డౌన్ లో నెలకొన్న పరిస్థితులు, కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు.

Update: 2020-05-11 02:34 GMT

లాక్ డౌన్ లో నెలకొన్న పరిస్థితులు, కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. కోవిడ్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్‌ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా మార్చడానికి అవసరమైన చర్యలతోపాటు, లాక్ డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలకు ఎలా ఊతమివ్వాలనే విషయంపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 27వ తేదీన ప్రధాని మోదీ, సీఎంలతో చర్చ జరిగిన సమయంలో దేశంలో కోవిడ్‌ కేసులు 28వేల వరకు ఉండగా ప్రస్తుతం అది 63 వేల వరకు చేరుకున్నాయి. అయితే గతంలో టెస్టుల సామర్ధ్యం తక్కువగా ఉంది.. అయితే ఆ తరువాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి.. అన్ని రాష్టాల్లో టెస్టింగ్ సామర్ధ్యం భారీగా పెంచారు.. దాంతో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ సమయంలో ప్రధాని మోదీ టెస్టింగ్ సామర్ధ్యం పెంచాలని రాష్ట్రాలకు ఆదేశించారు. ఇదిలావుంటే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపే ఐదో సమావేశం ఇది. మార్చి 25వ తేదీన మొదటిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన కేంద్రం..మూడోసారి ఈ నెల 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.

Tags:    

Similar News