గజగజ..ఇప్పుడే ఇలా ఉంటే...

Update: 2019-12-30 06:29 GMT
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు కాలు బయట పెట్టాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితి ఏర్పండింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రివేళలో వాతావరణం మరింత చల్లబడి ఉదయం 7 వరకూ మంచు కురుస్తూనే ఉంది. ఏపీలోని విశాఖ ఏజెన్సీ మినుములూరులో 7 డిగ్రీలు, పాడేరు 9, అరకులో10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టానికి పడిపోయాయి. అర్లిటిలో అత్యల్పంగా 5, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ 5.5, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో బయటకు రావాలంటే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. జమ్మూ-కాశ్మీర్‌, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 2.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లే పిల్లలు, ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హర్యానాలో స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఉదయం 10 గంటలు దాటినా పొగ మంచు తెర వీడటంలేదు. దీంతో వాహనాల రాకపోకలు, రైలు సర్వీసులకు అంతరాయం తప్పడం లేదు. అంతే కాక విమాన సర్వీసులపై కూడా పొగ మంచు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. 

Tags:    

Similar News