రేషన్‌ కార్డుదారులకు మే, జూన్‌ నిత్యావసరాలు ఉచితం: తమిళనాడు సీఎం పళని స్వామి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.

Update: 2020-05-05 16:13 GMT
Tamilnadu CM K.PalaniSwami

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 46,711 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 13,161మంది కోలుకున్నారు. 1,583మంది చనిపోయారు. ముఖ్యంగా దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

ఇక తమిళనాడు విషయానికి వస్తే ఈ రోజు 508 కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 279 కేసులు నమోదు కావడం విశేషం.. తాజా కేసులతో కలుపి రాష్ట్రంలో దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,058కి చేరింది. ఇప్పటివరకు 1,485 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,537 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33కి పెరిగింది.

ఇక తమిళనాడు ప్రభుత్వం కరోనా వైద్యం వేగాన్ని పెంచింది. అందులో భాగంగా చెన్నైలో నాలుగు వేల పడకలతో ఆసుపత్రిని సిద్ధం చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మే, జూన్ నెల నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల కార్మికులు ఇక్కడ పనులు చేసుకోవచ్చని, సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారిని దశల వారీగా రైళ్లలో పంపుతామని సీఎం పళనిస్వామి వెల్లడించారు.


Tags:    

Similar News