డేటింగ్ చేయాలా ఫోన్ చేయండి.. సీసీఏ నెంబర్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఓ నెంబర్ వైరల్ అవుతుంది.
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఓ నెంబర్ వైరల్ అవుతుంది. డేటింగ్ చేయాలంటే, లేక మూవీ టికెట్స్ ఫ్రీగా కావాలన్నా, నెట్ ఫిక్స్, అమెజాన్ వంటికి ఉచిత సబ్ స్ర్కిప్షన్ కావాలన్న 8866288662కు ఫోన్ చేయండి అంటూ సోషల్ మీడియాలో వైర్ అవుతుంది. మొదటి వేయి మంది కాలర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.15 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా కావాలంటే ఈ నెంబరుకు కాల్ చేయండి అంటూ... సోషల్ మీడియాలో ఈ 8866288662 నెంబర్ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నెంబర్ ఎవరిదంటే. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసిన అనంతరం ఈ బిల్లును సమర్ధించేవాళ్లు 8866288662 ఈ నెంబర్ కు కాల్ చేసి మద్దతు తెలపండి అంటూ. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి దీనిని ఆవిష్కరించారు. పౌరసత్వ సవరణ బిల్లు సీఏఏను అపహాస్యం చేయడానికో, లేదా పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలపాడానికో నెటిజన్లు దీనిని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నెంబర్ 8866288662 సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సంస్థలు ఎప్పటికప్పుడు ఈ ఖండిస్తూ వస్తున్నాయి.
मैं सभी देशवासियों से अपील करता हूँ कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा पाकिस्तान, बांग्लादेश और अफगानिस्तान से आए अल्पसंख्यकों को न्याय व अधिकार देने वाले CAA पर अपना समर्थन देने के लिए 8866288662 पर missed call दें।#IndiaSupportsCAA pic.twitter.com/BYPuoU2oIN
— Amit Shah (@AmitShah) January 3, 2020
2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన ఇతర దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకురుతుందని వ్యాఖ్యానించారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ద్వారా అప్ఘనిస్తాన్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్, దేశాలనుంచి వచ్చిన ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ గవర్నర్ నజీబ్ జంగ్ స్పందించారు. జామియా మిలీయా యూనివర్సిటీలో పోలీసులు ప్రవేశించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
This is absolutely fake. If you want free Netflix please use someone else's account like the rest of us. https://t.co/PHhwdA3sEI
— Netflix India (@NetflixIndia) January 4, 2020
@NetflixIndia, I know this is a trap to find out who's using others' accounts.
— Praband Bhatt (@praband) January 4, 2020
అయితే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ పౌరసత్వ సవరణ, ఎన్నార్సీలను తమ రాష్ట్రంతో అమలు చేయమని ప్రకటించారు. అంతే కాకుండా వాటి వ్యతిరేకంగా ర్యాలీ కూడా చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ బిల్లుపై ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. అక్కడ నిరసనకారులకు పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కొందరూ నిరసనకారులు పోలీసులపై కూడా దాడి చేశారు. ప్రభుత్వాస్తులు ధ్వంసం చేశారు. యోగి ఆదిత్యానాథ్ సర్కార్ ప్రభుత్వాస్తుల ద్వంసం చేసిన వారి నుంచే పరిహారం వసూలు చేస్తామని ప్రకటించారు.
అలీగఢ్ యూనివర్సిటీకి చెందిన దాదాపు ఒక వేయి మందిపైగా విద్యార్థులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF) కేసులు నమోదయ్యాయి. యూనివర్సిటీకి చెందిన దాదాపు 1300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న నిరసనల పేరుతో యూనివర్సిటీలో హింసకు పాల్పడటం, ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నివేదికలో పేర్కొంది. దీనిపై పోలీసులు స్పందించారు. పదివేల మందిపై కేసు నమోదు చేశామన్న వార్తల్లో నిజం లేదు. వేయి మంది విద్యార్ధులపై కేసు నమోదు చేశామని ఓ పోలీస్ అధికారి వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కూడా నిరసనలు మిన్నంటాయి. ముస్లీం ఇంధిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ చెపట్టారు. అయితే బీజీపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించడానికి సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.