తబ్లీజ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన దక్షిణాఫ్రికా మతాధికారి మృతి

ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీజ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన తరువాత భారతదేశం నుండి తిరిగి వెళ్లిన దక్షిణాఫ్రికా ముస్లిం మతాధికారికి, కరోనావైరస్ సంక్రమించింది.

Update: 2020-04-05 05:31 GMT
Representational Image

ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీజ్ జమాత్ కార్యక్రమానికి హాజరైన తరువాత భారతదేశం నుండి తిరిగి వెళ్లిన దక్షిణాఫ్రికా ముస్లిం మతాధికారికి, కరోనావైరస్ సంక్రమించింది. దాంతో ఆరోగ్యం విషమించి అతనుమరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మౌలానా యూసుఫ్ టూట్లా (80) మార్చి 1-15 నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిఘి జమాత్ మత కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆ తరువాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో మరియు విదేశాలలో కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా నిజాముద్దీన్ అవతరించింది.

అతని కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం టూట్ల భారతదేశం నుండి తిరిగి వచ్చిన తరువాత ఫ్లూ లాంటి లక్షణాలు కలిగి ఉన్నారని అన్నారు. తరువాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిపిన పరీక్షల్లో అతనికి వైరస్ ఉందని తేలింది. వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు.. ఈ క్రమంలో టూట్లా చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నాడు, కాని ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అనంతరం అతని మృతదేహాన్ని ఇస్లామిక్ బరయల్ కౌన్సిల్ (ఐబిసి) ఒక సంచిలో ఉంచి ఖననం చేశారు.

ఈ సమావేశానికి భారతదేశానికి వెళ్లవద్దని టూట్లకు సూచించారు కుటుంబసభ్యులు.. అయితే ఆయన ఎంత చెప్పినా వినకుండా భారత్ వచ్చారు. తోటి మతాధికారుల ప్రకారం, అతను ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమావేశాలలో చాలా చోట్లనే పాల్గొన్నాడని తెలిసింది.. ఇదిలావుంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు కిర్గిజ్స్తాన్ నుండి వివిధ ముస్లిం జాతీయులు ఢిల్లీలో కార్యకలాపాల కోసం వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News