Satish Gujral: భారతదేశపు ప్రసిద్ధ కళాకారుడు సతీష్ గుజ్రాల్ మృతి

భారతదేశపు ప్రసిద్ధ కళాకారులలో ఒకరైన సతీష్ గుజ్రాల్ (94) గురువారం సాయంత్రం కన్నుమూశారు.

Update: 2020-03-27 04:39 GMT
satish gujral

భారతదేశపు ప్రసిద్ధ కళాకారులలో ఒకరైన సతీష్ గుజ్రాల్ (94) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన సోదరుడు దివంగత ఇందర్ కుమార్ గుజ్రాల్ భారత ప్రధానిగా పనిచేశారు. మురలిస్ట్, చిత్రకారుడు, వాస్తుశిల్పి, డిజైనర్ మరియు కవితా ప్రేమికుడు గుజ్రాల్. తన రచనలకు గాను పద్మ విభూషణ్ అవార్డు లభించింది.

దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టు ముఖభాగాన్ని అలంకరించే వర్ణమాల కుడ్యచిత్రాన్ని వేయడం దగ్గరనుంచి జాతీయ రాజధానిలోని బెల్జియన్ రాయబార కార్యాలయాన్ని రూపొందించడం వరకు ఆయన సేవలు ఉన్నాయి. గుజ్రాల్ చిన్నవయసులోనే కళలకు ఆశక్తిపరుడయ్యారు. 1925 లో లాహోర్లో జన్మించిన గుజ్రాల్ దేశ విభజన భయానకతను చూశారు. కవితా ప్రేమికుడైన గుజ్రాల్ తరచూ కళపై తనకున్న ప్రేమ 'ఫైజ్ అహ్మద్ ఫైజ్' మరియు గాలిబ్ వంటి కవుల మాటల నుండి ఉద్భవించిందని చెబుతూ వచ్చారు. లాహోర్ కళాశాల విద్యార్థి అయిన తన అన్నయ్య ఇందర్‌తో కలిసి కవిత్వ పఠన సమావేశాలకు వెళ్లేవారు.



Tags:    

Similar News