కరోనా రోగిని కౌగలించుకోవడానికి రెడీ! : రమాకాంత్ యాదవ్

ఒకపక్కా... తుమ్మినా , దగ్గినా అది కరోనా వైరసే అనే భయం కలుగుతున్న రోజులివి.

Update: 2020-03-21 11:05 GMT
Ramakant Yadav (file photo)

ఒకపక్కా... తుమ్మినా , దగ్గినా అది కరోనా వైరసే అనే భయం కలుగుతున్న రోజులివి... కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు మనిషికి మనిషికి మధ్య ఆరడుగుల మధ్య దూరం ఉండాలని, వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా కరోనా వైరస్ సోకిన రోగినే కౌగిలించుకుంటానని సమాజ్ వాదీ పార్టీ నేత రమాకాంత్ యాదవ్ అన్నారు..

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ పైన అసత్య ప్రచారాలు చేస్తుందని, కరుణ వైరస్ వలన భారత్ లో ఏ ఒక్కరు కూడా మరణించలేదని అన్నారు.. అంతేకాకుండా కరోనా వైరస్ వచ్చిన రోగిని కౌగలించుకోవడానికి నేను రెడీ అని సంచలన కామెంట్స్ చేశారు.. దేశంలో సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనను పక్కదారి పట్టించడానికి కరోనాపై అవాస్తవాలు ప్రచారం చేస్తుందనీ ఆయన ఆరోపించారు..

ఇక దేశవ్యాప్తంగా రేపు (ఆదివారం) ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ కోరిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ రమాకాంత్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా కరోనా వైరస్ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. 280కి పైగా దేశాలకు పైగా ఈ వైరస్ సోకి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇక భారత్ లో ఈ వైరస్ కారణంగా ఐదుగురు మరణించారు..

Similar News